బాంబుల్లా పేలిన బీరు సీసాలు.. లారీ లోడ్ అగ్నికి ఆహుతి..!
కర్నూలు : హాట్ సమ్మర్‌లో కూల్ బీర్లు తెగ అమ్ముడుపోతాయి. ఎండ వేడిమి భరించలేక చాలామంది చల్లచల్లగా బీర్లు లాగించేస్తుంటారు. అలా ఎండాకాలంలో బీర్లకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇక అసలు విషయానికొస్తే.. బార్లకు చేరాల్సిన లోడ్ లారీ బీర్లు అగ్నికి ఆహుతి కావడం చర్చానీయాంశమైంది.
బీరు లోడ్‌తో వెళుతున్న లారీ కర్నూలు జిల్లాలో దగ్ధమైంది. లోడ్ దించడానికి వెళుతున్న సమయంలో ఇంజిన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో లారీలో ఉన్న బీరు సీసాలు బాంబుల్లా పేలినట్లు తెలుస్తోంది. డ్రైవర్‌కు తీవ్రగాయాలైనట్లు సమాచారం.

రహదారిపై ఒక్కసారిగా సీసాలు పేలుతుండటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. దాంతో రోడ్డు వెంబడి పరుగులు తీశారు. లారీ దగ్ధం కావడం, అందులోంచి సీసాలు ఎగిరిపడటంతో చాలాసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. వైద్య చికిత్స నిమిత్తం డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు.
ఎండాకాలం కావడంతో ఇంజిన్ వేడెక్కి ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఎండాకాలం బీర్ల అమ్మకాలు జోరుగా సాగనుండటంతో డిమాండ్ అధికంగా ఉంటుంది. ఆ మేరకు ఎంత స్టాక్ వచ్చినా మద్యం దుకాణాల్లో నిల్వ ఉండదు. ఆ క్రమంలో లారీ లోడ్ మధ్యాహ్నం బయలుదేరడం ఈ ప్రమాదానికి కారణంగా కనిపిస్తోంది. అదే సాయంత్రం పూట బయలుదేరి ఉంటే ఇలాంటి ఘటన జరిగి ఉండేది కాదనే వాదనలు వినిపించాయి.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications