కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మళ్లీ చేస్తావా ఇలా.. యువకుడిపై యువతి దాడి.. అడ్రస్ కనుక్కొని మరీ అటాక్

|
Google Oneindia TeluguNews

సోషల్ మీడియా అన్నింటికీ వేదిక. కానీ కొందరు నీచులు తమ స్వార్థానికి వాడుకుంటున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన షాన్ వాజ్ కూడా అలాంటి వాడే. ఓ యువతిని వేధించాడు. ఇంకేముంది ఆమె అడ్రస్ కనుక్కొని మరీ వచ్చింది. దేహాశుద్ది చేసి మరీ పోలీసులకు అప్పగించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆ యువతి చూపిన తెగువను ప్రతీ ఒక్కరు అభినందిస్తున్నారు. ఈ రోజుల్లో ఇలానే ఉండాలని.. లేదంటే ఆ నీచులు ఎంతటి దారుణానికి అయినా ఒడిగడతారని చెబుతున్నారు.

కర్నూలు జిల్లాకు చెందిన షాన్ వాజ్.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యువతికి సంబంధించి సోషల్‌ మీడియాలో అసభ్యకర కామెంట్లు పెట్టేవాడు. దీంతో ఆమె విసిగిపోయింది. అతనితో చాట్ చేసింది. అడ్రస్ కనుక్కొంది. చక్కగా ఎంట్రీ ఇచ్చింది. ఆ యువకుడు తన కోసం వచ్చిందని అనుకున్నాడు. కానీ తన తాటా తీయడానికి వచ్చిందని ఊహించలేకపోయాడు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ యువతి.. కర్నూలు జిల్లా ఆలూరుకు వచ్చింది. సదరు యువకుడికి దేహశుద్ధి చేసింది.

men harassing woman at social media

కొన్నాళ్ల క్రితం ఆమె సోషల్‌మీడియా వాల్‌పై ఆలూరుకు చెందిన షాన్‌వాజ్‌ అనే వ్యక్తి అసభ్యకర కామెంట్లు పెట్టాడు. కొన్నాళ్లుగా సోషల్‌ మీడియాలో యువతిని షాన్‌వాజ్ వేధిస్తున్నాడు. దీంతో ఆగ్రహించింది. యువకుడితో పరిచయం పెంచుకొని అడ్రస్‌ కనుక్కుంది. కలుద్దామని చెప్పి పశ్చిమగోదావరి జిల్లా నుంచి కర్నూలు జిల్లాలోని యువకుడి సొంతూరు ఆలూరుకు వచ్చింది. ఇక రాగానే ఆమె కోపం ఆగలేదు.

వచ్చీ రాగానే.. చెప్పు అందుకొని.. షాన్‌వాజ్‌ను చితకబాదింది. ఆడవాళ్లంటే అంత చులకనా అంటూ కొట్టింది. అడ్డుకోబోయిన యువకుడి కుటుంబసభ్యులకు కూడా దెబ్బలు తప్పలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కు వచ్చారు. కానీ యువతి దెబ్బలు మాత్రం ఆపలేకపోయారు. షానవాజ్ చేసింది తప్పే కాబట్టి.. ఫ్యామిలీ మెంబర్స్ కూడా మిన్నకుండిపోయారు.

English summary
men harassing woman at social media. she attack with slipper infront of his family. incident happened at kurnool.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X