వైఎస్ జగన్ బస్సు యాత్ర ఉద్దేశం ఏమిటో వివరించిన మంత్రి పెద్దిరెడ్డి

YS Jagan: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రణరంగానికి సిద్ధమైంది. ఇదివరకు నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలకు కొనసాగింపుగా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నారు. 175 నియోజవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసుకున్నారు. దీనికి మేమంతా సిద్ధం అని పేరు పెట్టిన విషయం తెలిసిందే.

ఈ బస్సు యాత్రపై విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ మధ్యాహ్నం కర్నూలులో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటనల సమన్వయకుడు, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, జిల్లా ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి, హ‌ఫీజ్ ఖాన్‌, చెన్న‌కేశ‌వ‌రెడ్డి, బాల‌నాగిరెడ్డి, సాయిప్ర‌సాద్‌రెడ్డి, కంగాటి శ్రీ‌దేవి, ఎంపీ అభ్య‌ర్థి బీవై రామ‌య్య‌, ఎమ్మెల్యే అభ్య‌ర్థులు ఇంతియాజ్‌, డాక్ట‌ర్ ఆదిమూల‌పు స‌తీష్‌, బుట్టా రేణుక పాల్గొన్నారు.

Minister Peddireddy Ramachandra Reddy review on CM YS Jagan s bus yatra

అనంతరం పెద్దిరెడ్డి మాట్లాడారు. పొత్తులు లేకుండా చంద్రబాబు ఎన్నికల్లో నిలబడలేడని, ఆయ‌న‌ ఓ రాజకీయ వికలాంగుడని అన్నారు. జనసేన, బీజేపీతో టీడీపీ పొత్తులు పెట్టుకుంటుందని ముందుగానే ఊహించామని వ్యాఖ్యానించారు. పొత్తుల వల్ల తమ పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య మరింత పెరుగుతుందని ధీమా వ్య‌క్తంచేశారు.

చంద్రబాబుది అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకుంటారనే మనస్తత్వం అని, జుట్టు అందలేదని బీజేపీ నాయకుల కాళ్లు పట్టుకున్నారని విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నారని ఆయన తేల్చి చెప్పారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని, ఇందులో సందేహాలు అక్కర్లేదని అన్నారు.

ఈ నెల 27వ తేదీన వైఎస్ జగన్ మేమంతా సిద్ధం పేరుతో బస్సుయాత్రను చేపట్టబోతోన్నారని, 28వ తేదీన నంద్యాల, 30వ తేదీన ఎమ్మిగనూరులో ఈ సభలను ఏర్పాటు చేశామని అన్నారు. తమ అయిదేళ్ల ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలను వైఎస్ జ‌గ‌న్ ప్రజలకు వివరిస్తారని అన్నారు. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ వారితో మమే­క­ం అవుతూ, పార్టీ క్యాడర్‌ను ఎన్నికల సంగ్రామానికి సన్నద్ధులను చేయడం ఈ బస్సు యాత్ర ఉద్దేశమని పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+