తెరపైకి అల్లుడు: నంద్యాలపై ఎస్పీవై రెడ్డి కొత్త ట్విస్ట్, అఖిలప్రియకు చంద్రబాబు షాకిస్తారా?
కర్నూలు: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాను ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా నంద్యాల లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తానని తెలుగుదేశం పార్టీ నేత, ఎంపీ ఎస్పీవై రెడ్డి శుక్రవారం వెల్లడించారు. తమ పార్టీ అధినేత, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నంద్యాల లోకసభ టిక్కెట్ తనకే ఇస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సర్వేలు తనకే అనుకూలంగా ఉన్నాయన్నారు.
అదే సమయంలో తన అల్లుడు శ్రీధర్ రెడ్డి నంద్యాల అసెంబ్లీ నుంచి చేస్తారని చెబుతున్నారట. ఇది కొత్త ట్విస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే నంద్యాల నుంచి భూమా బ్రహ్మానంద రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2017లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన గెలిచారు. సోదరి అఖిల దగ్గరుండి గెలిపించారు. భూమా బ్రహ్మానంద రెడ్డి సోదరి అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.

నంద్యాలపై కొత్త ట్విస్ట్
ఆళ్లగడ్డ, నంద్యాలల నుంచి భూమా కుటుంబం ప్రాతినిథ్యం వహిస్తోంది. ఇలాంటి సమయంలో ఎస్పీవై రెడ్డి తాను నంద్యాల లోకసభకు పోటీ చేస్తానని, తన అళ్లుడు శ్రీధర్ రెడ్డి నంద్యాల అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇది కొత్త ట్విస్ట్ అని చెప్పవచ్చు. ఎస్పీవై రెడ్డి 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు.

అల్లుడికి నంద్యాల అసెంబ్లీ సీటు
ఎస్పీవై రెడ్డి వ్యాఖ్యలతో కర్నూలు రాజకీయాలు రసవత్తరంగా మారినట్లుగా కనిపిస్తోంది. నంద్యాల లోకసభ నుంచి తానే పోటీ చేస్తానని అధినేత చంద్రబాబుకు చెప్పిన ఎస్పీవై రెడ్డి.. నంద్యాల అసెంబ్లీ సీటును తన అల్లుడికి కేటాయించాలని కోరినట్లుగా చెబుతున్నారు. చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

చంద్రబాబు ఎవరికి చెక్ చెబుతారు?
నంద్యాల లోకసభ నుంచి ఎస్పీవై రెడ్డి, అసెంబ్లీ నుంచి ఆయన అల్లుడు పోటీ చేస్తే, ప్రస్తుతం నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న భూమా బ్రహ్మానంద రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ సాగుతోంది. భూమా బ్రహ్మానంద రెడ్డి నంద్యాల నుంచి, ఆయన సోదరి అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురిలో ఒకరికి చంద్రబాబు చెక్ చెబుతారా అనేది ముందు ముందు తేలనుంది.

కర్నూలు రసవత్తరం
గతంలో మంత్రి నారా లోకేష్ కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. కర్నూలు ఎంపీగా బుట్టా రేణుక, కర్నూలు ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. ఇటీవల అఖిలప్రియ ఆళ్లగడ్డలో మాట్లాడుతూ.. ఆళ్లగడ్డలో తనపై ప్రత్యర్థులు కుట్ర చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తాను మళ్లీ విజయం సాధిస్తానని చెప్పారు. మొత్తానికి కర్నూలు జిల్లా టీడీపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications