సెక్స్ వీడియో: ఆన్ లైన్ క్లాస్ 8 తరగతి గ్రూపులో, రెండురోజులైనా డిలీట్ చేయని వైనం..

కరోనా వైరస్ వల్ల వ్యవస్థలు స్తంభించిపోయాయి. ఇక విద్యా వ్యవస్థకు జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. వైరస్ వల్ల మార్చిలోనే స్కూళ్లను మూసివేశారు. తిరిగి తెరిచే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. దీంతో ఆన్ లైన్ క్లాసులను నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్లతోపాటు.. ప్రభుత్వ బడుల్లో కూడా క్లాసులు జరుగుతున్నాయి. అయితే కొందరు పోకిరీలు చేసే వెకిలి చేష్టలు మాత్రం ఆందోళన కలిగిస్తోన్నాయి. కర్నూలు జిల్లాలో ఓ ఆన్ లైన్ క్లాస్ గ్రూపులో సెక్స్ వీడియో కనిపించింది. సదరు గ్రూపులో విద్యార్థినీలు ఉన్నా.. దానిని డిలేట్ కూడా చేయలేదు.

గర్ల్స్ హై స్కూల్ గ్రూప్‌లో..

గర్ల్స్ హై స్కూల్ గ్రూప్‌లో..

పత్తికొండ ప్రభుత్వ బాలికల హై స్కూల్‌లో ఘటన వెలుగుచూసింది. స్కూల్ తెరిచే పరిస్థితి లేనందున ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థినీల కోసం వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. అందులో స్టూడెంట్స్, టీచర్స్ ఉన్నారు. అయితే గ్రూపులో ఇటీవల సెక్స్ వీడియో కనిపించింది. పోస్ట్ చేసింది ఎవరో తెలియలేదు. కానీ ఆ పోస్ట్ చూసిన టీచర్లు కూడా స్పందించలేదు. దీంతో ఎవరూ పోస్ట్ చేశారు.. ఎందుకు తీయలేదు అనే ప్రశ్న వస్తోంది.

రెండురోజులు అలానే

రెండురోజులు అలానే

రెండురోజులవుతున్నా వీడియో అలానే ఉంది. టీచర్స్ కూడా పట్టించుకోకపోవడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో విద్యార్థి సంఘ నేతలు ఆందోళనకు దిగారు. ఎంఈవో ఆఫీసు ముందు నిరసన చేపట్టారు. దీంతో విషయం అందరికీ తెలిసింది. వీడియో పోస్ట్ చేసినవారిని గుర్తించాలని డిమాండ్ చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సదరు వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకుంటామని ఎంఈవో హామీనివ్వడంతో.. విద్యార్థి సంఘ నేతలు ఆందోళన విరమించారు.

ఎవరు సెండ్ చేశారు...

ఎవరు సెండ్ చేశారు...


వాట్సాప్ గ్రూపుకు టీచర్లు అడ్మిన్ ఉంటారు. వారు ఎవరినైనా చేర్చాలంటే వారు యాడ్ చేయాలి. తీసేయాలంటే కూడా వారే తీయాలి. మరీ టీచర్లు ఎవరినైనా యాడ్ చేశారా.. వారు వీడియో పోస్ట్ చేశారా అనే అంశం తెలియాల్సి ఉంది. లేదంటే టీచర్లలో ఎవరైనా ఒకరు వీడియో పోస్ట్ చేశారా తెలియాలంటే.. గ్రూప్ చూడాలి. దీనిపై సైబర్ క్రైమ్ నిపుణులకు ఫిర్యాదు చేస్తే.. భాగోతం బయటపడుతుంది. మొత్తానికి గ్రూపులో సెక్స్ వీడియో మాత్రం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+