వామ్మో.. భర్తను హత్య చేయించిన భార్య, సుపారీ గ్యాంగ్‌తో‌.. ఎందుకంటే...

కలికాలం అంటే ఇదెనేమో.. భార్య భర్తలు, పిల్లల మధ్య బంధాలు, అనుబంధాలు ఉండటం లేదు. అంతా యాంత్రికమే అవుతోంది. అయితే కొన్నిచోట్ల భార్య, భర్తలే దాడుల చేసుకోవడం.. హత్యలు చేయించుకోవడం అనే ఘటనలు వెలుగుచూస్తున్నాయి. కర్నూలు జిల్లాలో జరిగిన ఘటన ఇందుకు అద్దం పడుతోంది. మూడు ముళ్లు వేయించుకొని.. ఏడడుగులు నడిచిన భార్యే.. భర్తను హత్య చేయించింది. అదీ కూడా సుపారీ ఇచ్చి మరీ ఘాతుకానికి తెగబడింది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.

కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం చిన్నగుమ్మడాపురంలో దారుణం జరిగింది. దుర్గమ్మ అనే వివాహిత తన భర్తనే హత్య చేయించింది. దుర్గమ్మ స్వస్థలం.. శివపురం కాగా, పదేళ్ల క్రితం గంగయ్యను పెళ్లి చేసుకుంది. అయితే తొలినాళ్లలో బానే ఉన్న గంగయ్య.. తర్వాత మద్యానికి బానిసయ్యాడు. మందు సేవించొద్దు అని గొడవలు కూడా జరిగాయి. కానీ వినిపించుకోలేదు. భార్య భర్తల మధ్య సఖ్యత లేదు.

supari gang killed man in kurnool district..

భర్తకు చెప్పి చెప్పి దుర్గమ్మకు విసుగెత్తింది. లాభం లేదనుకొని చంపించాలని అనుకుంది. సుఫారీ గ్యాంగ్‌తో మాట్లాడింది. తన భర్తను చంపించేందుకు రూ.3 లక్షలకు బేరం కుదుర్చుకుంది. అడ్వాన్స్‌గా రూ. లక్ష అందజేసింది. దీంతో సుపారీ గ్యాంగ్.. గంగయ్య ఇంటికి వచ్చారు. అతని మాటల్లో పెట్టి.. మందు పేరు చెప్పి బయటకు తీసుకెళ్లారు. మద్యం తాగించగా.. మత్తులోకి వెళ్లిపోయాడు. అనంతరం కర్రలతో దాడి చేశారు. దీంతో అతను చనిపోయాడు. ఊపిరి రావడం లేదని నిర్ధారించకున్న తర్వాత నల్లమల అటవీలో పడేశారు. అయితే పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో దుర్గమ్మను తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+