కోరిక తీర్చు: మహిళతో వాలంటీర్ అసభ్య ప్రవర్తన, ఫిర్యాదుతో అరెస్ట్

పల్లెలే పట్టుగొమ్మలు.. పల్లె ప్రగతి పథంలో నడిపించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. అందుకోసమే గ్రామ సచివాలయాల్లో వేలాది వాలంటీర్లను నియమించారు. కానీ కొన్ని చోట్ల వాలంటీర్లు తమ విధులను సరిగా నిర్వహించడం లేదు. ఇక కర్నూలులో అయితే వాలంటీర్ రెచ్చిపోయాడు. ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించి.. ఆ వ్యవస్థకే మచ్చ తీసుకొచ్చాడు.

కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం బీ కోడూరులో ఘటన జరిగింది. గ్రామానికి చెందిన వాలంటీర్ సుభాన్.. మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. తన కోరిక తీర్చాలని వేధించాడు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి సాయం చేయాలని కోరితే.. వేధిస్తున్నాడని ఆమె వాపోయింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సుభాన్‌ను అరెస్ట్ చేసినట్టు నంద్యాల సీఐ మల్లికార్జున తెలిపారు.

volunteer misbehave to women in kurnool..

Recommended Video

    Bahrain Women breaking ganesh idol in capital manama | Oneindia Telugu

    మహిళతో వాలంటీర్ అసభ్య ప్రవర్తన కలకలం రేపింది. వాలంటీర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఉద్యోగం నుంచి తీసివేయాలని.. లేదంటే మరొకరు ఇలా బీహెవ్ చేసే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. సదరు మహిళ ఏ పథకం కోసం వాలంటీర్ వద్దకు వెళ్లిందో తెలియరాలేదు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+