అంగన్‌వాడీపై ప్రతాపం.. నడుంపై చేయి వేసుకుంటే తప్పా.. ఎస్ఐ గారీ దర్పం..?
కొందరీ అధికార దర్పం మాములుగా ఉండదు. అవును హోదాను చూసి మురిసిపోతుంటారు. కానీ తమ కన్నా చిన్న స్థాయిపై మాత్రం ప్రతాపం చూపుతారు. అవును అలాంటి ఘటన ఒకటి జరిగింది. అయితే ఓ మహిళ పోలీస్ అధికారి.. ప్రతాపం చూపడం ఆందోళన కలిగించింది. అవును ఇదేం తీరు అని అంతా ముక్కున వేలేసుకున్నారు. విమర్శలు కూడా చేస్తున్నారు.

ఎస్ఐ ఇలా..
మహిళా ఎస్ఐ జులుం ప్రదర్శించింది. ఓ అంగన్ వాడీ టీచర్ పై మహిళా ఎస్ఐ చేసిన జులుం ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. విషయం తెలుసుకున్న ప్రజా సంఘాలు ఫైర్ అవుతున్నాయి. ఓ అంగన్ వాడీ వర్కర్ పట్ల ఎస్ఐ ఇలా వ్యవహరించడం తప్పు కాదా ? వెంటనే ఆమెను సస్పండ్ చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆమె తండ్రిని కూడా స్టేషన్‌కు తీసుకెళ్లి నిర్భందించడం దారుణం అని.. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇక్కడ ఘటన..
కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో చోటు చేసుకుంది.ఎస్ఐ ముబీనా.. దళిత మహిళ అయిన అంగన్ వాడీ టీచర్ హరితపై విరుచుకపడింది. ఏం తప్పు చేశానని టీచర్ ప్రశ్నించింది. తాను తప్పు చేయనప్పుడు స్టేషన్ కు ఎందుకు రావాలని ప్రశ్నించింది. తననే ప్రశ్నిస్తావా ? అంటూ ఎస్ఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన ముందే నడుంపై చేయి వేసుకుని నిలబడుతావా ? కళ్లు నెత్తికెక్కాయా ? ఎవరితో మాట్లాడుతున్నావో కనబడడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. జీపు ఎక్కాలని హుకుం జారీ చేసింది.
Recommended Video

ముందు స్టేషన్‌కు పద
స్టేషన్‌కు వెళ్లిన తర్వాత, అన్నీ చెబుతాం అని ఎస్ఐ ముబీనా హెచ్చరించింది. సెల్‌లో వీడియో తీస్తోన్న వ్యక్తిని కూడా తీసుకురావాలని అక్కడున్న సిబ్బందిని ఆదేశించింది. ఇదేమిటీ దౌర్జన్యం అని ప్రశ్నించిన హరిత తండ్రిని కూడా స్టేషన్ కు తీసుకెళ్లి నిర్భందించారు. అసభ్యకరంగా ప్రవర్తించిన ఎస్ఐని సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంగన్ వాడి టీచర్ అయిన హరితను మానసిక ఒత్తిడికి గురి చేశారని అంటున్నారు. తాగేందుకు మంచినీరు ఇవ్వలేదని, దారుణంగా ప్రవర్తించిన ఎస్ఐ ముబీనాను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications