ఈయన దేశ్ కీ నేత..?పేరంట్స్‌ను వెళ్లగొట్టిన మహా నేత

పేరంట్స్ అంటే కనిపించే దైవాలు.. కానీ పెరిగి, పెద్దయ్యాక వారు బరువు అవుతున్నారు. అవును కొందరు పట్టించుకోవడం లేదు. మరికొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే ప్రజా ప్రతినిధులు మాత్రం మిగతావారికి ఆదర్శంగా నిలుస్తారు. లోన ఎలా ఉన్నా.. బయటకు మాత్రం రావడం లేదు. అయితే నేతలు వారి పేరంట్స్‌ గురించి ఆలోచిస్తారు.. కానీ బయటకు పంపించడం కాస్త చర్చకు దారితీసింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఇలాంటి ఘటన జరిగింది.

ఎమ్మిగనూరులో దారుణం జరిగింది. తల్లిదండ్రులపై మున్సిపల్ ఛైర్మన్ రఘు దాడికి తెగబడ్డాడు. తల్లిని ఇంటి నుంచి గెంటివేశాడు. ఆస్తి కోసం తల్లిదండ్రులతో రఘు గొడవపడుతున్నాడు. ఈ క్రమంలో వారిపై దాడి చేశాడు. ఆస్తి కోసం రఘు తమను వేధిస్తున్నాడని తల్లి సరోజ ఎమ్మిగనూరు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. ఇంటికి వచ్చి తమపై దాడి చేస్తున్నాడని, కుమారుడితో తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు రక్షణ కల్పించాలని ఆమె ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. గత మూడు నెలలుగా ఆస్తి కోసం తన కొడుకు వేధిస్తున్నాడని ఆమె తెలిపారు.

yemmiganur municipal chairman rude behave to parents

మున్సిపల్ చైర్మన్ ప్రవర్తన సర్వత్రా చర్చానీయాంశమవుతోంది. పేరంట్స్‌తో ఇలా బీహేవ్ చేస్తే ఇక ప్రజలతో ఎలా మసలుకుంటాడో అనే సందేహాం ఉంది. కని పెంచిన వారితో ఇలా నడచుకోవడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజమే.. తల్లిదండ్రులను చక్కగా చూసుకోవాలె.. కానీ వయసు పై బడిన వారితో తప్పుగా ప్రవర్తించడం మంచిది కాదు. వారిని ఇబ్బంది పెట్టడం సరికాదు.

సాధారణ జనం అలా చేస్తే ఓకే.. కానీ ప్రజా ప్రతినిధి ఇలా చేయడం భావ్యం కాదు. మిగతావారికి ఆదర్శంగా ఉండాల్సిన నేత ఇలా బీహెవ్ చేయడం మంచి పద్దతి కానే కాదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇదేం తీరు అని ఫైర్ అవుతున్నారు. నేత అంటే ఇలానే ఉంటారా అని అడుగుతున్నారు. నలుగురు ప్రశంసించాలే తప్ప.. దూషించే మాదిరిగా ఉండకూడదని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+