జీవితఖైదు, రూ.20 వేల జరిమానా.. మైనర్ బాలికపై రేప్ కేసులో తీర్పు..
బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికదాడి చేసిన నిందితుడికి కోర్టు కఠిన శిక్ష విధించింది. అతనికి జీవితఖైదు, రూ.20 వేలు జరిమానా విధించింది. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని రాచాల గ్రామానికి చెందిన కావలి ఆంజనేయులుకు కోర్టు శిక్ష విధించింది. ఈ తీర్పుపై బాలిక తరఫున బంధువులు హర్షం వ్యక్తం చేశారు.
వనస్థలిపురం సెల్ప్ ఫైనాన్స్ కాలనీలో ఆంజనేయులు మేస్త్రీ పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయాన్ని ఆయన దాచాడు. 2015లో ఓ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ తర్వాత లైంగికదాడి చేశాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ దారుణం వెలుగుచూసింది. బాధితురాలి తల్లి వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు విచారించిన సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి సురేష్.. నిందితుడికి పోక్సో చట్టం కింద శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పారు.

Recommended Video
నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా.. ఆడపిల్లకు రక్షణ కరువైంది. నిత్యం ఏదో ఒక చోట వారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మాయమాటలతో నమ్మించి కొందరు కామాంధులు కామ కోరికలు తీర్చుకుంటున్నారు. అవసరం తీరాక ముఖం చాటేస్తున్నారు. మరికొందరు స్నేహం ముసుగులో, సాయం ముసుగులో దారుణాలకు ఒడిగడుతున్నారు. వారి అవసరాలను ఆసరాగా చేసుకుని లైంగిక దాడులు చేస్తున్నారు. ఇలాంటి కేసుల్లో నిందితులకు కఠిన శిక్ష విధిస్తున్నా మహిళలపై దారుణాలు మాత్రం ఆగడం లేదు.












Click it and Unblock the Notifications