ఆ రెండు జిల్లాలో లిక్కర్ సేల్స్ హై.. అక్కడ మహిళలు కూడా.. ఇదీ లెక్క
తెలుగు రాష్ట్రాల్లో మద్యం విక్రయాలు ఎక్కువే.. ఆంధ్రాతో పోలిస్తే.. తెలంగాణలో అమ్మకాలు ఎక్కువే. ఇక న్యూ ఇయర్, దసరా పండుగ అయితే మద్యం ఏరులై పారుతుంది. మద్యం విక్రయాలకు సంబంధించి తెలంగాణలో గణాంకాలు వెల్లడయ్యాయి. అయితే ఆ రెండు జిల్లాల్లో ఎక్కువ సేల్స్ ఉన్నాయి. దానికి గల కారణాలు కూడా తెలుసుకుందాం.. పదండి.

పెరిగిన మందుబాబులు..?
తెలంగాణ రాష్ట్రంలో మద్యపానం సేవించే వారి సంఖ్య, ఇతర గణాంకాలు గతంలో కంటే భారీగా పెరిగాయి. దీనికి సంబంధించి ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది. తెలంగాణ ప్లానింగ్ డిపార్టుమెంటు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపట్టి ఓ నివేదిక రూపొందించింది. రాష్ట్రంలో అత్యధికంగా మద్యం వినియోగం జనగామ జిల్లాలో ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. 60.6 శాతం మంది మద్యం ప్రియులతో జనగామ జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉండగా.. 58.4 శాతంతో యాదాద్రి భువనగిరి జిల్లా, 56.5 శాతంతో మహబూబాబాద్ జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు.

22 జిల్లాలో సగం కంటే ఎక్కువ
రాష్ట్రావ్యాప్తంగా మద్యం సేవించేవారి సంఖ్య సగటున 43.3 శాతంగా ఉండగా.. 22 జిల్లాల్లో రాష్ట్ర సగటు కంటే ఎక్కువ మంది మద్యం సేవించేవారు ఉన్నట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఎక్కువ జనాభా కలిగిన హైదరాబాద్ జిల్లాను కాదని మిగతా జిల్లాల్లో మద్యం వినియోగం పెరగడం విశేషం. హైదరాబాద్ అర్బన్ పరిధిలో కేవలం 28 శాతం మంది మాత్రమే మద్యం సేవించే వారు ఉన్నట్లు ప్లానింగ్ డిపార్టుమెంట్ నివేదికలో పేర్కొంది. ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లో మద్యం దుకాణాల సంఖ్య పెరగటం, ఎక్కడంటే అక్కడ బెల్ట్ షాపులు ఉండటంతో రూరల్ జిల్లాల్లో మద్యం సేవించే వారి సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.

వామ్మో.. మహిళలు కూడా
రాష్ట్రంలో మద్యం సేవించే మహిళల సంఖ్య కూడా ఇటీవల కాలంలో పెరిగిందని నివేదికలో పేర్కొన్నారు. ఇదీ కాస్త ఆశ్చర్యానికి గురిచేసింది. సిటీ లైఫ్‌లో లేడీస్ మందు తీసుకుంటారంటే.. ఏదో అడ్జస్ట్ కావచ్చు.. కానీ అదీ క్రమంగా గ్రామీణ ప్రాంతాలకు పాకితే ఇబ్బందులే.. రాష్ట్రంలో సగటున ప్రతి 100 మందిలో ఏడుగురు మహిళలు మద్యం సేవిస్తున్నారట. మెదక్ జిల్లాలో అత్యధికంగా 23.8 శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నారని తెలిసింది. రూరల్ ప్రాంతాల్లో అతివలు మద్యం సేవిస్తున్నారని సర్వేలో తేలింది. కష్టం చేసేవారు ఈతకల్లు, తాటికల్లు తాగితే ఫరావాలేదు.. కానీ బీర్, విస్కీ అంటూ తాగితే మాత్రం కాస్త ఇబ్బందికర పరిస్థితులే ఉంటాయి.












Click it and Unblock the Notifications