వామ్మో.. వీరు మహా ముదుర్లు.. రోడ్డు రోలర్ దొంగిలించి.. పార్టు పార్టులుగా..
కరోనా వల్లో.. లేదంటే పని చేత గావడం లేదో అర్థం కావడం లేదు. దొంగలు కొత్త పంథా తొక్కుతున్నారు. అవును.. ఏదీ కనిపిస్తే అదీ తీసుకెళుతున్నారు. అయితే మనం ఇంటి బయట కొన్ని వస్తువులను ఎంచక్కా ఉంచేయచ్చు.. అవును ఎక్కువగా బరువు ఉండే వస్తువులు.. వాహనాలను అలా పెడతాం. వాహనాలకు లాక్ కూడా చేస్తుంటాం.. చేసినా కొందరు తీసుకెళతారు.. అదీ వేరే విషయం అనుకొండి.. ఇక విషయానికి వస్తే.. రోడ్ రోలర్ తెలుసుగా.. అవును రోడ్డు పనుల కోసం మాత్రమే వాడతారు. కానీ దానిని కూడా మహానుభావులు తీసుకెళ్లారు.

కేటుగాళ్లు
వికారాబాద్ జిల్లా తాండూరులో దొంగలు రెచ్చిపోయారు. రెచ్చిపోవడం అంటే మాములుగా కాదు.. ఏకంగా రోడ్డు రోలర్‌ను చోరీ చేశారు. బ్రిడ్జి పనుల కోసం తీసుకెళ్లి.. అక్కడే కొన్ని నెలలు వదిలేసిన రోలర్‌ను లారీలో ఎక్కించి పాత సామాన్ల షాపుకు తరలించారు. పాత సామాన్ల కొట్లలో విడిభాగాలు కనిపించడంతో ఆ రోడ్డు రోలర్ ఓనర్ షాక్ అయ్యాడు. ఇదేంటి తన వాహనం లాగా ఉందనుకున్నాడు. చూసి నోరెళ్లబెట్టాడు.

వదిలి వెళితే..
స్థానిక గుండ్లమడుగు తండాకు చెందిన నర్సింహారెడ్డి 5 నెలల క్రితం బ్రిడ్జ్, పనులను చేపట్టారు. ఈ పనులకు బిల్లులు రాకపోవడంతో పనుల కోసం వేరే ప్రాంతానికి వెళ్లిపోయాడు. అప్పుడు రోడ్డు రోలర్ అక్కడే వదిలేసి పోయాడు. అవసరం వచ్చినప్పుడు.. రోలర్ కోసం వస్తే.. అక్కడ కనిపించలేదు. అదేంటబ్బా.. అనుకొని అర్థం కాలేదు. తర్వాత జినుగుర్తికి చెందిన షాబోద్దిన్ రోలర్‌ను లారీలో తీసుకెళ్లారని గ్రామస్తులు చెప్పారు. దీంతో విషయం బయటకు వచ్చింది.

కొనుగోలు చేశాం..
షాబోద్దిన్‌ను ఆరా తీస్తే కొంతమంది తాము రోలర్‌ను కొనుగోలు చేశామని చెప్పారని. తాను కేవలం లారీని కిరాయికి తీసుకెళ్లానని చెప్పాడు. పాత సామాగ్రీ గోదాముకు వెళ్లి చూస్తే రోలర్ విడి భాగాలు కనిపించాయి. అంటే ఆ రోడ్డు రోలర్ తీసుకెళ్లి.. ఇనుప సామానులకు అమ్మేశారు. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇదీ మాత్రం నిజం. రోడ్డు రోలర్ కూడా వదలలేరు కదా అనుకొని ఆశ్చర్యపోవడం ఓనర్ వంతయిపోయింది.

విడి భాగాలు
ఇప్పుడు కొందరు వాహనాలు దొంగలించి.. ఏ పార్టుకు ఆ పార్టు తీసేస్తున్నారు. విడి భాగాలను అమ్మేసుకుంటున్నారు. వాస్తవానికి వాహనాలను కూడా విక్రయించొచ్చు.. కానీ బండి ఇంజిన్‌కు గల ఛేసిస్ నంబర్ బట్టి.. చెకింగ్ చేసే సమయంలో వాహనాలు పట్టుబడుతున్నాయి. దీంతో దొంగలు అంతకన్నా తెలివిగా ప్రవరిస్తున్నారు. విడి భాగాలను అమ్మేసి అందినకాడికి దోచుకుంటున్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications