కామ ఖాకీ: వివాహితతో ఎఫైర్.. ఫ్రెండ్స్‌తో కలిసి చితకబాదిన భర్త.. (వీడియో)
అతనో ఖాకీ.. మంచి చెడు చెప్పాల్సిన స్థాయి అతనిది.. కానీ బుద్ది గడ్డి తిన్నది. పరాయి స్త్రీతో పడక పంచుకున్నాడు. ఇంకేముంది.. భర్త, అతని స్నేహితులు కలిసి చితకబాదారు. ఈ ఘటన వనపర్తి జిల్లాలో జరిగింది. అందుకు సంబంధించిన వీడియో తీశారు. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అదీ కాస్తా వైరల్ అవుతుంది. ఆ ఎస్ఐని ప్రవర్తనను పలువురు తప్పుపడుతున్నారు. ఇదేం తీరు అని ఫైర్ అవుతున్నారు.

స్నేహితులతో కలిసి
భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఎస్ఐని భర్త అతడి స్నేహితులు చితకబాదారు. వనపర్తి జిల్లా కొత్తకోట చెందిన మహిళతో వనపర్తి రూరల్ ఎస్ఐ షేక్ షఫి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారం చాలా రోజుల నుంచి జరగుతుంది. ఈ విషయం సదరు మహిళ భర్తకు ఎలాగొలా తెలిసింది. ఇద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునే అవకాశం కోసం వేచి చూశాడు. అలా చూడగానే సమయం రానే వచ్చింది.

రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు
ఈ నెల 18న మహిళను కలిసేందుకు ఎస్ఐ షఫీ ఆమె ఇంటికి వెళ్ళాడు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న భర్తకు ఎస్ఐ ఇంట్లోకి వచ్చాడనే విషయం తెలిసింది. దీంతో కుటుంబ బంధువులు స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. ఎస్ఐ షఫీ భార్యతో ఉన్న సమయంలో ఇంట్లోకి వచ్చాడు. అతను ఆగ్రహాంతో ఊగిపోయాడు. షఫీని చితకబాదారు. వద్దు అన్న వినిపించుకోలేదు. దాడి చేయడంతో.. ఎస్ఐ గాయపడ్డాడు.

ఎస్ఐపై దాడి
దాడి ఘటనకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎస్ఐని కొడుతుండగా అడ్డుకున్న సదరు మహిళ చెంప చెళ్లుమనిపించారు. విషయం పోలీసులకు తెలియడంతో ఘటనాస్థలికి చేరుకొని.. గాయపడిన ఎస్ఐని వనపర్తి ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఎస్ఐని సస్పెండ్ చేశారు.

పోలీసులకు విలువ
సమాజంలో పోలీసులకు మంచి విలువ ఉంది. వారు అంటే భయం భక్తి ఉంది. అలాంటి కొందరు మహిళలతో ఇలా బిహేవ్ చేయడం సరికాదు. ఇదీ డిపార్ట్ మెంట్‌కు మచ్చగా మారనుంది. ఇప్పుడే కాదు ఇదివరకు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. అప్పటి వరకు చర్యలు తీసుకున్నా.. తర్వాత షరా మమూలే. సో ఇలాంటి కొందరు రెచ్చిపోతున్నారు.












Click it and Unblock the Notifications