ముందడుగు వేసిన కేసీఆర్ - అసెంబ్లీ ఎన్నికల దిశగా..!!

మహబూబ్ నగర్: అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ ప్రవేశించినట్టే. దీనికి సంబంధించిన వేడి ఇప్పుడిప్పుడే రాజుకుంటోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి సరిగ్గా ఇంకో ఏడాది సమయం మిగిలివుంది. ఈ నేపథ్యంలో- అధికార టీఆర్ఎస్ ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారిస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై గురి పెడుతోంది. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది.

మహబూబ్ నగర్‌లో..

మహబూబ్ నగర్‌లో..

ఇందులో భాగంగా- ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇవ్వాళ మహబూబ్‌ నగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొనున్నారు. ఈ సభ ద్వారా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల ప్రచార శంఖారావాన్ని ఆయన పూరిస్తారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో ఉంది.

పర్యటన సందర్భంగా

పర్యటన సందర్భంగా

తన మహబూబ్ నగర్ జిల్లా పర్యటన సందర్భంగా కేసీఆర్- కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయ భవన సముదాయాన్ని ప్రారంభించనున్నారు. టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకుని రానున్నారు. పాత కలెక్టరేట్‌ స్థలంలో ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మినీ ట్యాంక్‌బండ్‌ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలను కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

 విజయవంతం చేయడానికి..

విజయవంతం చేయడానికి..

కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయడానికి టీఆర్ఎస్ జిల్లా నాయకులు, కార్యకర్తలు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. లక్ష మందికి పైగా ప్రజలను ఈ సభకు సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. దీనికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో ప్రజల తరలించనున్నారు. దీని తరువాత ఆయన వరుసగా జిల్లా పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. 7వ తేదీన జగిత్యాల జిల్లాకు కేసీఆర్ వెళ్లనున్నారు. ఈ పర్యటన ఇప్పటికే ఖరారైంది కూడా.

సీబీఐ నోటీసులు అందుకున్న నేపథ్యంలో..

సీబీఐ నోటీసులు అందుకున్న నేపథ్యంలో..

కేసీఆర్ కుమార్తె, పార్టీ శాసన మండలి సభ్యురాలు కవితకు సీబీఐ నోటీసులను జారీ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం నేపథ్యంలో ఆమెను సీబీఐ అధికారులు విచారించనున్నారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్‌‌లో కవిత పేరును చేర్చిన అనంతరం సీబీఐ నుంచి నోటీసులు వచ్చాయి. ఈ పరిణామాల మధ్య మహబూబ్ నగర్ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగం ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠతను రేపుతోంది.

 ముందస్తు సంకేతాలు..

ముందస్తు సంకేతాలు..

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే వార్తలు కూడా వెలువడుతోన్న విషయం తెలిసిందే. బీజేపీ నాయకుడు, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దీనిపై ఇదివరకే సంకేతాలు కూడా ఇచ్చారు. కర్ణాటకతో పాటు తెలంగాణ అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు తాజాగా కేసీఆర్ వరుసగా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

 యుద్ధ ప్రాతిపదికన..

యుద్ధ ప్రాతిపదికన..

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలంటూ కేసీఆర్ ఇదివరకే ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రాజెక్ట్‌కు కూడా శంకుస్థాపన చేయనున్నారాయన. 6,500 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. అటు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ నియోజకవర్గాల్లో మకాం వేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలనీ సూచించారు. ఆయా పరిణామాలతో అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేడి రాజుకున్నట్టయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+