కానిస్టేబుల్ వెంటపడి తాళి కట్టాడు.. సినిమా సీన్ కాదు.. ఎక్కడంటే..!
మంచిర్యాల : అది కలెక్టర్ కార్యాలయం. వచ్చీ పోయే వాళ్లతో అక్కడి వాతావరణం సందడిగా ఉంది. ఓ మహిళ కానిస్టేబుల్ విధి నిర్వహణలో బిజీగా ఉన్నారు. మిగతా వాళ్లు కూడా ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు. ఆ సమయంలో అపరిచితుడు ఎంట్రీ ఇచ్చాడు. సరాసరిగా సదరు లేడీ కానిస్టేబుల్ దగ్గరకు వెళ్లాడు. అటు ఇటు చూశాడు. అదను చూసి జేబులో చేయి పెట్టాడు. బయటకు తాళి తీశాడు. ఎంత వేగంగా జేబులో నుంచి తాళి తీశాడో.. అంతే స్పీడ్‌తో ఆమె మెడలో కట్టేశాడు. పనిలో నిమగ్నమైన సదరు కానిస్టేబుల్ తేరుకుని చూసే లోపు ఆ తంతు ముగించాడు. అయితే ఇదంతా సినిమా సీన్ కాదు.. రియల్ లైఫ్‌లో జరిగిందే. మంచిర్యాలలో వెలుగు చూసిన ఈ ఘటన చర్చానీయాంశంగా మారింది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో చింతర రజిత మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు ఇదివరకే వివాహం జరిగి.. నలుగురు ఆడ పిల్లలున్నారు. అయితే ఆరు నెలల కిందట భర్త చనిపోయారు. ఆ క్రమంలో వరుసకు బావయ్యే జగిత్యాలకు చెందిన చింతల కుమారస్వామి తనను పెళ్లి చేసుకోవాలంటూ వెంటపడుతున్నాడు. అతడికి కూడా ఇదివరకే పెళ్లయి ముగ్గురు పిల్లలున్నారు. దాంతో రజిత అతడితో పెళ్లికి నిరాకరిస్తూ వచ్చారు. ఇటీవల తనను పెళ్లి చేసుకుంటానంటూ మరింత వేధించాడు. ఆ నేపథ్యంలోనే గురువారం నాడు ఆమె డ్యూటీలో ఉండగా మెడలో తాళి కట్టి హల్‌చల్ చేశాడు.

ఎప్పటిలాగే గురువారం నాడు కలెక్టరేట్ ప్రధాన ద్వారం దగ్గర విధులు నిర్వహిస్తున్నారు రజిత. ఆ సమయంలో తనతో మాట్లాడేది ఉందంటూ మెల్లిగా మాటలు కలిపాడు. సడెన్‌గా జేబులో నుంచి తాళి తీసి ఆమె మెడలో కట్టేశాడు. అయితే కుమార స్వామి అలా చేయడంతో ఆమె కంగు తిన్నారు. వెంటనే మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో అతడిపై ఫిర్యాదు చేశారు. ఆమె కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications