వీడెక్కడి మొగుడురా నాయనా.. భార్యను లారీ కిందకు తోసేశాడు..!
జహీరాబాద్ : అనుమానం ఆ కుటుంబంలో పెనుభూతమైంది. భార్యపై క్రమక్రమంగా పెరిగిన అనుమానం చివరకు ఆమెను హత్య చేసేలా పురిగొల్పింది. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. మొగడపల్లి మండలం మన్నాపూర్‌కు చెందిన శంకరయ్యకు నాగమణి అనే మహిళతో పదేళ్ల కిందట పెళ్లయింది. అయితే ఇటీవల ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి.
గ్రామానికే చెందిన మరో వ్యక్తితో భార్యకు అక్రమ సబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు శంకరయ్య. దాంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని ప్లాన్ వేశాడు. ఆ క్రమంలో తన స్నేహితులైన ఆటో, లారీ డ్రైవర్ల సాయం తీసుకున్నాడు. పథకం ప్రకారం సమయం కోసం అదనుచూసి చివరకు మట్టుబెట్టాడు.

మంత్రి నా కాళ్లు మొక్కుడేంది.. ఆ వార్తపై హరీష్ రావు ఆగ్రహం.. చివరకు సారీ చెప్పారుగా..!
ముందే వేసుకున్న పథకం ప్రకారం సోమవారం రాత్రి ఝరాసంగంలోని ఓ ఆలయానికి దర్శనం కోసం భార్యతో కలిసి వచ్చాడు శంకరయ్య. తన స్నేహితుడి ఆటోలో అక్కడకు చేరుకున్నారు. ఇక తిరుగు ప్రయాణంలో హత్యా పథకం అమలు చేశారు. కుప్పానగర్ గ్రామ శివారులోకి రాగానే ఆటో టైరు పంక్చర్ అయ్యిందని.. రోడ్డుమీద నుంచి పక్కకు తోయాలని చెప్పడంతో నాగమణి ఆటో దిగింది.
అలా ఆమె కూడా ఆటోను పక్కకు తోయడానికి సహకరిస్తున్న సమయంలో ముందు అనుకున్నట్లుగానే లారీని అటువైపు నడుపుకుంటూ వచ్చాడు మరో స్నేహితుడు. అదే అదనుగా భావించిన శంకరయ్య ఆమెను లారీ టైర్ల కిందకు తోసేశాడు. దాంతో ఆమె స్పాట్‌లోనే చనిపోయింది. రోడ్డు ప్రమాదంలో భార్య చనిపోయిందని నమ్మించేందుకు శంకరయ్య ఈ పథకం వేశాడు. ఆ ముగ్గురు కూడా పరారీలో ఉన్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.












Click it and Unblock the Notifications