సింగూరు ప్రాజెక్టులో జలకళ.. 22 టీఎంసీలకు చేరువలో నీరు
గత మూడు రోజుల నుంచి వాన బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఇవాళ ఒక్కరోజే ఉదయం పూట కాస్త ఎండ వచ్చింది. తర్వాత చలిగాలి.. వర్షం కురిసింది. వర్షం, ఎగువన కురుస్తోన్న వానలతో ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి. దీంతో పలు ప్రాజెక్టుల్లోకి భారీగా ప్రవాహం వచ్చింది. ఇటు సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టులోకి వరద తీవ్రత పెరుగుతూనే ఉంది. వరద నీరు 22 టీఎంసీలకు చేరువలో ఉంది.
సోమవారం సాయంత్రానికి ప్రాజెక్టులోకి 6192 క్యూసెక్కుల నీరు వరద రూపంలో వచ్చి చేరిందని ప్రాజెక్టు డిప్యూటీ ఈఈ నాగరాజు తెలిపారు. వరద తీవ్రత పెరిగిన దృష్ట్యా ప్రాజెక్టుపై సిబ్బందిని అప్రమత్తం చేశామని ఆయన తెలిపారు. వరద తీవ్రత ఇలాగే కొనసాగితే మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్టులో 22 టీఎంసీలు దాటే అవకాశాలు ఉన్నాయని వివరించారు.

ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రాజెక్టులో ప్రస్తుతం 20.422 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఇన్ ప్లో 6192 క్యూసెక్కులు కొనసాగుతుండగా, అవుట్ ఫ్లో 400 క్యూసెక్కులుగా ఉందని ప్రాజెక్టు డిప్యూటీ ఈఈ తెలిపారు. మిగతా ప్రాజెక్టుల్లో కూడా అలానే పరిస్థితి ఉంది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి కూడా భారీగా వర్షపు నీరు చేరుతుంది. ఇలాగే వానలు కొడితే గరిష్ట నీటి మట్టం చేరే అవకాశం ఉంది.
రాష్ట్రంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో స్కూళ్లకు మూడు రోజులు సెలవు ఇచ్చిన సంగతి తెలిసిందే. రోజు రాత్రి పూట కూడా భారీ వర్షం పడుతుంది. ఉదయం లేవగానే చల్లని గాలులతో.. వాతావరణం చల్లగా ఉంది. వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది. జ్వరాలు విజృంభించే ఛాన్స్ ఉంది. జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. కాచి వడబోసిన నీటిని తాగాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications