Dogs Attack: నర్సాపూర్‍లో దారుణం.. బాలికపై వీధి కుక్కల దాడి..
రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఓ చోట కుక్కల దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఓ బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి. చిన్నారి అరవడంతో అక్కడి చేరుకున్న తల్లిదండ్రులు కుక్కలను వెళ్లగొట్టారు. అయితే కుక్కల దాడిలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. తలకు, ముఖానికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాలికను వెంటనే హైదరాబాద్ కోరంటి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే బాలికపై దాడి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొద్ది రోజుల క్రితం అంబార్ పేటలో ప్రదీప్ అనే బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి చంపాయి.
ఈ ఘటన అప్పట్లో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై చాలా మంది స్పందించారు. అయితే ఇప్పటికీ వీధి కుక్కల దాడులు ఆగడం లేదు. కొద్ది రోజుల క్రితం ఖమ్మం జిల్లాలో కూడా కుక్కలు కరవడంతో ఓ బాలుడు మృతి చెందాడు. కొన్ని రోజుల క్రితం వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం బొంరెడ్డిపల్లి గ్రామంలో వీధి కుక్క ఓ బాలుణ్ని తీవ్రంగా గాయపరిచాయి. మార్చి 7న చంపాపేట డివిజన్ యాదగిరినగర్‌కాలనీ సంతోషనగర్ ప్రధాన రహదారి పక్కన నిద్రిస్తున్న యాచకుడిపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో వీధి కుక్కల దాడులు పెరిగిపోడంతో ప్రజలు భయపడిపోతున్నారు. ముఖ్యంగా రాత్రి బయటకు రావాలంటే జంకుతున్నారు.

మొన్నటికి మొన్న సిద్దిపేట కలెక్టరేట్ లో కుక్కలు హల్ చల్ చేశాయి. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని కుక్కలు కరిచాయి. వీధి కుక్కలు పెంపుడు కుక్కను కూడా గాయపరిచాయి. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 1వ రాత్రి అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తాను నివాసముంటున్న క్వార్టర్స్ ఆవరణలో వాకింగ్ చేస్తుండగా ఓ వీధి కుక్క దాడి చేసింది. దీంతో ఆయన రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications