వెంకన్న ఇదేందయ్యా.. గోడు వెల్లబోసుకుంటే ఇలా చేస్తావా... చివరికీ చెప్పు దెబ్బ

అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించొద్దు.. ముఖ్యంగా మహిళలతో అయితే చక్కగా నడచుకోవాలి. కానీ కొందరు మాత్రం తీరు తప్పుతారు. తమ ఇష్టమొచ్చినట్టు బీహేవ్ చేస్తారు. మహిళలతో తప్పుగా ప్రవర్తించడంతో.. భడిత పూజ తప్పదు. అలా సంగారెడ్డిలో ఓ అధికారి దెబ్బలు తిన్నాడు. ఏం జరిగిందా అని చూస్తే.. అతను చేసిన వెకిలి చేష్టలు కనిపించాయి.

ఫోన్‌లో అసభ్యంగా మాట్లాడి వేధించిన ఓ అధికారిని సదరు మహిళ, కుటుంబసభ్యులతో కలిసి దేహశుద్ధి చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో జరిగింది. సంగీత అనే మహిళ ఇల్లు కూలిపోయింది. కొత్త ఇంటిని నిర్మించుకునేందుకు అనుమతి కోసం సదాశివపేట మున్సిపల్ ఆఫీసుకు వెళ్లింది. సంగీత ఫోన్ నెంబర్ తీసుకున్న శానిటరి ఇన్‌స్పెక్టర్ వెంకన్న ఆమెతో అసభ్యంగా మాట్లాడడం ప్రారంభించారు. వేధింపులను మాత్రం వెంకన్న ఆపలేదు.

woman slaps municipal officer with slippers

విషయాన్ని సంగీత తన భర్తకు చెప్పింది. దీంతో ఆమె భర్త, ఇతర కుటుంబసభ్యులు మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. వెంకన్నకు దేహశుద్ధి చేశారు. సంగీత అతనిని చెప్పుతో మరీ కొట్టింది. మహిళలతో ఇలా ప్రవర్తిస్తావా అని తిట్టిపోసింది. కుటుంబసభ్యులు కూడా తమ చేతులకు పనిచెప్పారు. ఆ తర్వాత జరిగిన ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అధికారి.. బాధ్యతగా నడుచుకోవాలి. ఇలా తప్పుడు మాటలు మాట్లాడటం భావ్యం కాదు. తనకు న్యాయం చేయాలని.. సాయం చేయాలని అడిగితే ఇలా చేస్తారా అని పలువురు అంటున్నారు. కొందరు అధికారులు ఇలా.. మరికొందరు నగదు అడగటంతో మిగతావారు కూడా నమ్మకం, విశ్వాసం కోల్పోతున్నారని చెబుతున్నారు. ఒకరు చేసిన పని.. అందరికీ వర్తిస్తోందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+