యాదాద్రి జిల్లాలో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. పైలట్ కు తీవ్రగాయాలు
యాదాద్రి : యాదాద్రి జిల్లాలో ఆర్మీ ట్రైనింగ్ విమానం కుప్పకూలింది. బాహుపేట శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన పైలట్ ప్యారాచూట్ సహాయంతో కిందకు దూకినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఆర్మీ అధికారులు వైద్య సిబ్బందిని ఘటనాస్థలికి పంపించారు. ఫస్ట్ ఎయిడ్ తర్వాత పైలట్ ను హైదరాబాద్ లోని మిలటరీ ఆసుపత్రికి తరలించారు. విమానం కూలిన ఘటనపై దర్యాప్తు చేపడుతున్నారు. సాంకేతిక కారణాలతో విమానం కూలినట్లు తెలుస్తోంది. ఖాళీ స్థలంలో విమానం కూలడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.

సరిగ్గా వారం కిందట రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని మొఖిల గ్రామంలో ప్రైవేట్ శిక్షణ విమానం కూలింది. ఆ ఘటనలో కూడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. పైలట్ సురక్షితంగా బయటపడగా.. ట్రైనింగ్ పొందుతున్న భరత్ భూషణ్ అనే యువకుడికి స్వల్పగాయాలయ్యాయి.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications