భువనగిరిలో బిగ్ ఫైర్ యాక్సిడెంట్.. భారీగా ఆస్తినష్టం..!
భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భువనగిరి ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ కెమికల్ కంపెనీలో ఆదివారం అర్ధరాత్రి దాటాక మంటలు చెలరేగాయి. వివిధ రకాల కెమికల్స్ తయారయ్యే ఈ కంపెనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తోంది.
అగ్నిప్రమాదం విషయం తెలియగానే జిల్లా అధికారులు స్పందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయకచర్యలు ముమ్మరం చేశారు. ఒకవైపు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తూనే మరోవైపు ఇతర పరిశ్రమల యాజమానులను అలర్ట్ చేశారు. చౌటుప్పల్, యాదగిరిగుట్ట అగ్నిమాపక కేంద్రాలకు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ఎగసిపడ్డ మంటలను అదుపులోకి తెచ్చారు. ఆస్తినష్టం దాదాపు 10 కోట్ల రూపాయల మేర ఉంటుందనేది అధికారుల అంచనా.













Click it and Unblock the Notifications