సబ్బండ వర్గాలను మోసం.. కేసీఆర్‌పై షర్మిల విసుర్లు
సీఎం కేసీఆర్‌పై వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల విమర్శలు కొనసాగిస్తున్నారు. ప్రజాప్రస్థానంలో భాగంగా 44వ రోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నూతనకల్ మండలంలోని మిర్యాల క్రాస్ వద్ద పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి లింగంపల్లె, మంచన్ పల్లె గ్రామాల మీదుగా సాగి ఆత్మకూరు (ఎస్) మండలంలోని మిడ్తన్ పల్లి గ్రామానికి చేరుకుంది. అనంతరం కొత్తగూడెం గ్రామంలో షర్మిల మాట-ముచ్చట కార్యక్రమం నిర్వహించారు.

నయవంచన..
వైయస్ఆర్ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని షర్మిల తెలిపారు. అన్ని వర్గాలకు సమన్యాయ పాలన అందించారు. ఏ పథకం ప్రవేశపెట్టినా అందరికీ వర్తించేలా చేశారు. ఏ నాయకులు ఆలోచన చేయకుండా, పేదవాడికి జబ్బు చేస్తే ఆ కుటుంబం మొత్తం అప్పుల పాలవుతుందని, ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందించారు. కేసీఆర్ మోసం చేయని వర్గం లేదు. ఎన్నికల ముందు రుణమాఫీ అని రైతులను మోసం చేశారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అని.. మూడెకరాల భూమి ఇస్తానని దళితులను మోసం చేశారు. చివరికీ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ అని ముస్లింలను ఛీట్ చేశారని తెలిపారు.

అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా
చివరి గింజ వరకూ వడ్లు కొంటానన్న కేసీఆర్ ఇప్పుడు మాట మార్చి, ఢిల్లీ డ్రామాలు స్టార్ట్ చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పండించిన వడ్లను కొనడం చేతకాకే ధర్నాలు చేస్తున్నారు. వరి లేకుంటే ఉరేనని రైతులు వాపోతున్నా ఏనాడు పట్టించుకోలేదు. వడ్ల కొనుగోళ్ల విషయంలో ఊసరవెళ్లిలా రంగులు మారుస్తున్నారు. ఓసారి సన్నొడ్లు వేసుకోవాలని చెప్పారు. మరోసారి తామే వడ్లు కొంటామని పేర్కొన్నారు. ఇప్పుడేమో వరి వేయొద్దని, కొనమని చెబుతున్నారు. వ్యవసాయాన్ని ఆగం చేసి, రైతుల్ని బానిసలుగా మారుస్తున్నాడని ఫైరయ్యారు.

పేదల రక్తం..
ఎన్నికలు వచ్చిన సమయంలో కేసీఆర్‌కు హామీలు గుర్తుకొస్తాయని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఒక్కటి కూడా గుర్తురాదు. బీజేపీ, టీఆర్ఎస్ రేట్లు పెంచి పేదల రక్తం తాగుతున్నయని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, నూనె రేట్లు కేంద్రం పెంచితే.. విద్యుత్ చార్జీలు, రిజిస్ట్రేషన్ చార్జీలు, మున్సిపల్ చార్జీలను రాష్ట్రం ప్రభుత్వం పెంచి, పేదల నడ్డి విరుస్తున్నాయని తెలిపారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications