ఫేస్‌బుక్ పరిచయం, ప్రేమ పెళ్లి.. మూడు నెలలకే కథ అడ్డం తిరిగింది
మిర్యాలగూడ : నీవే సర్వస్వం అన్నాడు. ప్రేమ మత్తులో ముంచేశాడు. ఫేస్‌బుక్ పరిచయాన్ని పెళ్లిపీటలెక్కించాడు. అంతవరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత ప్లేటు ఫిరాయించాడు. ఆనాడు నమ్మించి పెళ్లిచేసుకుని ఈనాడు మోసం చేయాలని చూడటంతో సదరు యువతి ఠాణా మెట్లెక్కింది.
ఏపీలోని విజయవాడ బెంజి సర్కిల్‌కు చెందిన ధారావత్ వాణికి.. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడకు చెందిన ధనావత్ విష్ణుతో పరిచయం ఏర్పడింది. రెండేళ్ల కిందట ఫేస్‌బుక్ ద్వారా ఏర్పడిన వీరి పరిచయం క్రమంగా ప్రేమకు దారితీసింది. దాంతో వీరిద్దరూ ఐదు నెలల కిందట పెళ్లి కూడా చేసుకున్నారు.

చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో వాణి.. తన అక్క వాళ్లింట్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటోంది. ఆ క్రమంలో విష్ణుతో ఏర్పడిన పరిచయం పెళ్లికి దారి తీసింది. అదలావుంటే ఆమె నుంచి వివిధ సందర్భాల్లో దాదాపు 10 లక్షల రూపాయల వరకు తీసుకున్నాడట. ఇప్పుడేమో తల్లిదండ్రులు చూసిన మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు. వాణికి విషయం తెలియడంతో తనను మోసం చేశాడని ఆరోపిస్తూ చందంపేట పోలీసులను ఆశ్రయించింది.

వాణి, విష్ణు పెళ్లి అతడి కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని తెలుస్తోంది. ఆ క్రమంలో విజయవాడలో ఉంటున్న విష్ణును.. గత రెండు నెలల కిందట అతడి బంధువులు కిడ్నాప్ చేసినట్లు అక్కడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తన భర్తకు అనారోగ్యం కారణాలు సాకుగా చూపి వైద్యం చేపిస్తామంటూ విజయవాడ నుంచి తీసుకొచ్చారని వాణి ఆరోపిస్తోంది. అదే క్రమంలో మరో యువతితో పెళ్లి జరిపించారని వాపోయింది. అయితే ఆ పెళ్లికి ముందే తాను పోలీస్ స్టేషన్‌కు వచ్చినా.. పోలీసులు పట్టించుకోలేదన్నారు. చందంపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అల్రెడీ విజయవాడలో కేసు ఉంది గదా అక్కడే తేల్చుకోవాలంటూ సూచించారట. వాణితో పాటు ఆమె వెంట వచ్చిన బంధువులకు సర్ధిచెప్పడంతో చేసేదేమీ లేక వారు విజయవాడ తిరిగి వెళ్లిపోయినట్లు సమాచారం.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications