ఇవాళ కర్నె ప్రభాకర్ అసంతృప్తి, కార్యక్రమాలకు పిలవడం లేదని ఆగ్రహాం..
మునుగోడు బై పోల్‌ను అన్నీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలిచేందుకు అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. ప్రధానంగా పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉండనుంది. అధికార పార్టీలో అసంతృప్తులు మెల్లిగా బయటకు వస్తున్నారు. టికెట్‌ను బూర నర్సయ్య ఆశిస్తున్నారు. ఆయన మంత్రి జగదీశ్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఇప్పుడు కర్నె ప్రభాకర్ వంతు వచ్చింది. ఆయన కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు.
మునుగోడు టీఆర్ఎస్‌లో అసంతృప్తి నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇటీవల మంత్రి జగదీశ్ రెడ్డిపై మాజీ ఎంపీ బూర నర్సయ్య అసహనం వ్యక్తం చేశారు. ఆ ఘటన మరవకముందే తాజాగా కర్నె ప్రభాకర్ గళం విప్పారు. తనను ముఖ్య కార్యక్రమాలకు పిలవడం లేదని కర్నె ప్రభాకర్ అన్నారు. నియోజకవర్గ బాధ్యుల తీరు సరిగాలేదన్నారు.

ముఖ్యమైన కార్యక్రమాలకు తనను పిలవపోవడాన్ని తప్పుపట్టారు. దీనిపై నియోజకవర్గ బాధ్యుడి విచక్షణకే వదిలేస్తున్నట్లు కర్నె ప్రభాకర్ చెప్పారు. ఎవరు పిలిచినా..పిలవకపోయినా సీఎం కేసీఆర్ కోసం పనిచేస్తానన్నారు. 10 మంది ఆశావహుల్లో టికెట్ ఎవరికి ఇచ్చినా పని చేస్తానని కర్నె ప్రభాకర్ వెల్లడించారు.
బై పోల్ గెలవాలని టీఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది. ఈ క్రమంలో ఇలా అసంతృప్తులు కాస్త ఇబ్బందికరమే.. బీజేపీ విజయం సాధిస్తే ఆ పార్టీ మరింత బలపడుతుంది. మరీ పార్టీలో నెలకొంటున్న అనిశ్చితిని కేసీఆర్ ఎలా చల్లారుస్తారో చూడాలీ మరీ.












Click it and Unblock the Notifications