ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నుంచి ప్రాణ హాని... మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన మహిళ...
నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు నుంచి తమ కుటుంబానికి ప్రాణ హాని ఉందని ఆరోపిస్తూ బంటు మణెమ్మ అనే మహిళ గురువారం(సెప్టెంబర్ 24) హైదరాబాద్‌లోని మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అక్రమ కేసులు బనాయించి తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆరోపించారు.
మిర్యాలగూడలో భూకబ్జాదారులు రెచ్చిపోతున్నారని... ఎమ్మెల్యే కూడా వారితో చేతులు కలిపి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. తన భర్త బుచ్చిబాబు లాయర్ అని... ఆయన బాధితుల తరుపున వాదిస్తున్నందుకు ఎమ్మెల్యే తమపై కక్ష కట్టారని ఆరోపించారు. ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మిర్యాలగూడ టౌన్ పోలీసులు కుమ్మక్కై తమను వేధిస్తున్నారని... వారి నుంచి ప్రాణ హాని ఉందని పేర్కొన్నారు. ఇటీవల ఎమ్మెల్యే ఒత్తిడితో మిర్యాలగూడ పోలీసులు తమ ఇంట్లోకి చొరబడి ముఖ్యమైన ఫైళ్లు, కాగితాలు, పాస్ పుస్తకాలు, దస్తావేజులతో పాటుగా కీలకమైన పత్రాలను లాక్కెళ్లారని చెప్పారు.

తన భర్త,కుమారుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే,పోలీసుల వేధింపులతో తమ కుటుంబం బిక్కుబిక్కుమంటూ గడుపుతోందని... ఎప్పుడేం జరుగుతుందో తెలియక తీవ్ర భయాందోళనకు గురవుతున్నామని చెప్పారు. తన భర్తపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న మిర్యాలగూడ పోలీసులు,ఎమ్మెల్యే భాస్కరరావులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీని కోరారు.
మరోవైపు మణెమ్మ ఆరోపణలను ఎమ్మెల్యే భాస్కర రావు ఖండించినట్లు తెలుస్తోంది. రాజకీయ దురుద్దేశంతో తన ప్రత్యర్థులే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని భాస్కరరావు ఆరోపించినట్లు సమాచారం.
Recommended Video
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications