రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి.. దళితబంధుపై రఘునందన్ రావు

దళిత బంధును రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో అమలు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. సోమవారం భువనగిరి పట్టణంలో హిందూవాహిని ఆధ్వర్యంలో అఖండ భారత దివాస్ సభ నిర్వహించారు. ఈ సభలో రఘునందన్ రావు పాల్గొన్నారు. ప్రతి ఏడాది ఆగస్టు 14వ తేదీన అఖండ భారత్ సంకల్ప దివాస్ నిర్వహిస్తామని చెప్పారు. అప్పట్లో ప్రధాని చేసిన తప్పిదాల కారణంగా పోరుగు దేశాలతో తరుచూ గొడవలు వచ్చేయన్నారు. గతంలో ఇంటింటికి సర్వే నిర్వహించిన ప్రభుత్వ అధికారులు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నవారికి దళిత బంధు ఇస్తా అనడం హాస్యాస్పదంగా ఉందని రఘునందన్‌రావు అన్నారు.

 pls..implement dalitha bandhu state wide

ఇవాళ దళితబంధు ప్రారంభించారో లేదో.. విమర్శలు మొదలయ్యాయి. కాంగ్రెస్ ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. తర్వాత ఒక్కో నేత కామెంట్ చేశారు. ఇప్పుడు రఘునందన్ రావు టర్న్ వచ్చింది. ప్రభుత్వంపై ఒంటికాలిపై లేచారు. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. బై పోల్ కోసం.. ఒక నియోజకవర్గానికే పరిమితం చేయడం కరెక్ట్ కాదన్నారు. అందరికీ సంక్షేమ ఫలాలు అందాలని కోరారు

ప్రభుత్వ దళిత ఉద్యోగులకు దళితబంధును వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. హుజూరాబాద్ వేదికగా దళితబంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పథకం అమలు తీరును వివరించారు. హుజూరాబాద్‌లో ఉన్న‌ ప్ర‌తి ఒక్క ద‌ళిత కుటుంబానికి రెండు నెల‌ల్లో డ‌బ్బులు అందజేస్తామన్నారు. హుజూరాబాద్ కాడ అంద‌రికీ ఎందుకు ఇస్తారంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప‌థ‌కం అమ‌లు చేయాలన్నారు. 25 ఏళ్ల కింద సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న‌ సమయంలో.. సిద్దిపేట ద‌ళిత చైత‌న్య జ్యోతి అని ప్రారంభించామని వివరించారు. ఇది ఇవాళ్టి కొత్త దుకాణం కాదు. అప్పుడే పాట‌లు రూపొందించామని చెప్పారు. గత 25 ఏళ్ల నుంచి తన మెదడులో ఉందన్నారు. ప్ర‌పంచంలో అణ‌గారిన, అణిచివేయ‌బ‌డ్డ జాతులు ఎన్నో ఉన్నాయని వివరించారు. దేశంలో ద‌ళితుల మాదిరిగా ప్ర‌పంచ వ్యాప్తంగా 165 జాతులు సామాజిక వివ‌క్ష‌కు గుర‌య్యాయని చెప్పారు. అంబేద్క‌ర్ పోరాటం వ‌ల్ల అన్ని ప‌ద‌వుల్లో రిజ‌ర్వేష‌న్లు, ఉద్యోగ అవ‌కాశాలు ల‌భించాయని సీఎం అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+