ప్రేమ కొంప ముంచింది.. లవర్ కోసం సొంతింట్లో దొంగతనం.. ఓ యువతి ప్రేమకథ

సూర్యాపేట : ప్రేమలో మునిగి తేలితే ఎంతటివారైనా ట్రాక్ తప్పుతారేమో. ప్రేమ మత్తులో తాము ఏం చేస్తున్నామో తెలియక తప్పుదోవ పడుతున్న ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. అలా నమ్మకం అనే ముసుగులో ప్రేమ పేరును వాడుకుంటూ మోసాలు చేస్తున్న మాయగాళ్లకు కొదువే లేదు. ఆ క్రమంలో ప్రేమికుడి మోజులో విచక్షణ మరచిపోయి సొంతింట్లో చోరీకి పాల్పడింది ఓ యువతి.

ప్రియుడి మాటలను గుడ్డిగా నమ్మింది. సదరు మోసగాడు ఆశల పల్లకిలో ఊరేగించడంతో గాల్లో తేలిపోయింది. నువ్వే నా బంగారం అంటూ నాలుగు తీయని మాటలు చెప్పేసరికి ఇంట్లోని బంగారం మాయం చేసింది. దొంగతనం నేర్పిన ప్రేమాయణం సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసింది.

 ప్రియుడి కోసం చోరీ.. వాట్ ఏ ప్రేమ కహానీ

ప్రియుడి కోసం చోరీ.. వాట్ ఏ ప్రేమ కహానీ

ఉన్నత విద్య అభ్యసిస్తున్న ఓ యువతి ప్రేమ మాయలో పడింది. పొరుగింటివాడో, క్లాస్‌మేటో గాకుండా ఎవడో గుర్తు తెలియని గొట్టంగాని వలలో చిక్కుకుంది. సూర్యాపేటకు చెందిన సదరు యువతి తన తాత ఇంట్లో ఎం.ఫార్మసీ చదువుతోంది. డిగ్రీ వరకు ప్రేమ, గీమ తెలియని ఈ భామ ఓ మోసగాడి తీయని మాటలకు బెండ్ అయింది.

యానాం ప్రాంతానికి చెందిన సతీష్ అనే యువకుడితో ఇన్‌స్టాగ్రాంలో పరిచయం ఏర్పడింది. ఎనిమిది నెలల కిందట తొలిసారిగా ఆన్‌లైన్‌లో కలిసిన వీరిద్దరు క్రమక్రమంగా ప్రేమికులుగా మారారు. ఆ క్రమంలో అతడు ఆమెకు ఏం చెప్పాడో తెలియదు గానీ 20 తులాల బంగారు ఆభరణాలను బహుమానంగా ఇచ్చింది. అయితే ఏ తాత దగ్గర తాను ఆశ్రయం పొందుతుందో.. వాళ్ల ఇంట్లోనే చోరీకి పాల్పడింది. ఏప్రిల్ 14వ తేదీన తాత బీరువా తెరిచి చూడగా.. బంగారు ఆభరణాలు కనిపించలేదు. దాంతో చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ప్రియుడికి ప్రేమతో.. తాతకు ఎసరు..!

ప్రియుడికి ప్రేమతో.. తాతకు ఎసరు..!

ఆ తాతకు మనవరాలిపై ఎలాంటి అనుమానం రాలేదు. ఆమె కూడా తాతకు అనుమానం రాకుండా జాగ్రత్త పడింది. ఆ క్రమంలో తమ ఇంట్లో అద్దెకు ఉండే మహిళపై ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేశారు. కానీ విచారణలో ఆమెకు ఆ చోరీతో ఏ సంబంధం లేదనే విషయం బయటపడింది. దాంతో ఇంటి దొంగలే ఆ పని చేసి ఉంటారనే కోణంలో దృష్టి పెట్టారు పోలీసులు.

అదలావుంటే ప్రియురాలు ఇచ్చిన నగలు తాకట్టు పెట్టి ఖరీదైన కారు కొని జల్సా జీవితం గడిపాడు సతీష్. ఇద్దరు కూడా పోలీసులు తమను పట్టుకోలేరనే ధీమాతో ఉన్నారు. ఒకవేళ బండారం బయటపడితే.. అప్పటికప్పుడు కారు అమ్మేసి నగలు ఇస్తాగా అంటూ సతీష్ చెప్పడంతో అతడి మాటలు నమ్మింది. అయితే ఈ కేసుపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టడంతో వారి బాగోతం గుట్టురట్టైంది.

గుట్టురట్టు ఇలా.. చివరకు చిక్కారిలా..!

గుట్టురట్టు ఇలా.. చివరకు చిక్కారిలా..!


ఇంటి దొంగల పనిగా అనుమానించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు స్పీడప్ చేశారు. సదరు యువతితో పాటు ఫిర్యాదుదారు కుటుంబసభ్యుల కదలికలపై నిఘా పెట్టడంతో అసలు విషయం బయటపడింది. యానాంలో ఉండే సతీష్‌తో ఆమె తరచుగా ఫోన్ మాట్లాడుతున్నట్లు ట్రేస్ చేశారు. సెల్‌ఫోన్ కాల్ డాటాతో చోరీని చేధించారు. ఇక్కడ ఏం జరుగుతోంది, పోలీసులు ఏమంటున్నారు తదితర విషయాలను తన ప్రియుడికి ఎప్పటికప్పుడు చెరవేయడం గమనార్హం.

మొత్తానికి కేసులో కీలక ఆధారాలు దొరకడంతో ఆదివారం నాడు సతీష్‌తో పాటు సదరు యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగారం చోరీ గురించి ప్రశ్నించగా నిజం ఒప్పుకున్నారు. ప్రేమికుడి కోరిక మేరకు కారు కొనుక్కునేందుకు తాత ఇంట్లో బంగారం చోరీ చేసినట్లు అంగీకరించింది ఆ యువతి. అదలావుంటే దొంగతనం నేర్పిన ఈ ప్రేమాయణం కథ స్థానికంగా చర్చానీయాంశమైంది.

సోషల్ మీడియాలో ప్రేమ పాఠాలు.. యువతులకు గాలం

సోషల్ మీడియాలో ప్రేమ పాఠాలు.. యువతులకు గాలం

సోషల్ మీడియాలో ప్రేమ పాఠాలు వల్లిస్తున్న సదరు మోసగాడు పలువురు యువతులకు గాలం వేసినట్లు తెలుస్తోంది. సూర్యాపేట యువతిని నమ్మించిన విధంగానే ఒకరిద్దరు కాదు.. దాదాపు 25 మందిని అమ్మాయిలను ట్రాప్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రధానంగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వేదికగా అమ్మాయిలకు వల వేస్తాడని నిర్ధారించారు. అనంతరం వారిని బుజ్జగించో.. బెదిరించో నగదు, డబ్బులు వసూలు చేయడం సతీష్ నైజమని పోలీసులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+