నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోదాడలో టెన్షన్ టెన్షన్: బండి సంజయ్ వాహనం అడ్డగింత..

|
Google Oneindia TeluguNews

కోదాడలో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వాహనాన్నిస్వేరో కార్యకర్తలు అడ్డుకున్నారు. హిందూ దేవుళ్లను కించపరిచేలా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చేసిన ప్రమాణంపై సంజయ్ ఘాటుగా స్పందించారు. కామెంట్లకు నిరసనగా స్వేరోలు దాడికి యత్నించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నడుమ హైదరాబాద్‌కు సంజయ్ తిరుగు ప్రయాణం అయ్యారు.

 పవన్ కళ్యాణ్ తీరు బాధించింది: బండి సంజయ్, జనసేనాని మళ్లీ బాబు పంచకే అంటూ ఏపీ మంత్రి పవన్ కళ్యాణ్ తీరు బాధించింది: బండి సంజయ్, జనసేనాని మళ్లీ బాబు పంచకే అంటూ ఏపీ మంత్రి

స్వేరో పవిత్ర మాసం సందర్భంగా పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడుకాపూర్‌, ధూళికట్ట గ్రామాల మధ్యగల బౌద్ధస్తూపం వద్ద పాలరాతి బుద్ధవిగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు. ప్రవీణ్‌కుమార్‌ ముఖ్యఅతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞా కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆయన కూడా చేయి చాచి నిలబడ్డారు.

swero workers blocked bandi sanjay

ప్రమాణంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. సమాజంలో వైషమ్యాలు సృష్టిస్తున్న స్వేరోస్ సంస్థపై వెంటనే చర్య తీసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రోద్బ‌లంతో హిందూ మనోభావాలను దెబ్బతీసేలా కుట్ర జరుగుతోందన్నారు. సంస్థకు నిధులెక్కడి నుంచి వస్తున్నాయి.. లెక్కలు తీస్తారా? కేంద్రానికి ఫిర్యాదు చేసి అక్కడి నుంచి తీయించమంటారా?' అని సంజ‌య్ ట్వీట్ చేశారు.

హిందువులను కించపరిచే జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఏమి చేస్తోందన్నారు. చాలా ఏళ్ల నుంచి కుట్ర జరుగుతోందన్నారు. హిందూ వ్యతిరేకులను ప్రోత్సహించడమే సీఎం కేసీఆర్ తన విధిగా చేసుకున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 'ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నప్పటికీ సీఎం కేసీఆర్ మౌనం వహించడం ఆయన పతనానికి నాంది కాబోతోందన్నారు. విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని బండి సంజ‌య్ హెచ్చ‌రించారు.

English summary
swero workers blocked bandi sanjay at nalgondas kodad town.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X