నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మునుగోడు నాడీ పట్టిన టీఆర్ఎస్, సబ్బండ వర్గాలకు పథకాలు

|
Google Oneindia TeluguNews

మునుగోడులో టీఆర్ఎస్ విజయానికి చాలా కారణాలు ఉన్నాయి. అందుకు సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు చాలా ఉన్నాయి. 2.41 లక్షల మంది ఓటర్లకు అధికార పార్టీ వరాలు కురిపించింది. దాదాపు 10 లక్షల కోట్లు స్కీమ్ ప్రవేశపెట్టారు. కొన్నింటినీ నేరవేర్చారు. ప్రజలకు టీఆర్ఎస్ పట్ల నమ్మకం కలిగించారు.

మునుగోడు నియోజకవర్గంలో కేవలం 3 గ్రామాల్లో 99 మందికి దళిత బంధు ఇచ్చారు. దీనిపై మిగతా చోట్ల వ్యతిరేకత వచ్చింది. ఎన్నికకు కొద్దీ రోజుల ముందు ఎస్టీ రిజర్వేషన్ పెంచుతూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 6 నుంచి 10 శాతానికి పెంచింది. అలాగే కొత్త రేషన్ కార్డులను కూడా జారీచేసింది. అలానే ఫించన్లు కూడా ఇస్తామని చెప్పింది.

 trs offer to schemes to munugodu people

మునుగోడులో 100 బెడ్ల ఆస్పత్రి హామీ ఇచ్చింది. అలాగే చండూరును రెవెన్యూ డివిజన్ చేసింది. సీఎం కేసీఆర్ రెండు సభల్లో పాల్గొని ప్రసంగించారు. మంత్రులు గ్రామ గ్రామాన తిరిగారు. ఉద్యోగ ప్రకటన కూడా చేసింది. ఇదే కాదు చేనేత భీమా కూడా అమలు చేశారు. గౌడ భీమా కూడా చేస్తామని చెప్పారు.

ఇలా ఒక్కొక్క కులానికి, వర్గానికి మేలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. అదీ జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది. తమ ప్రయోజనాల కోసం ప్రభుత్వం పాటుపడుతుందని అనుకొని ఉంటారు. అందుకే రాజగోపాల్ రెడ్డిని కాదని.. ప్రభాకర్ రెడ్డికి జనం పట్టం కట్టారు. ఈ విజయంతో టీఆర్ఎస్ పార్టీ జోష్‌లో ఉంది. ఇటీవల ఎమ్మెల్యేల కొనుగోలు అంశం దుమారం రేపింది. దాంతో కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి.. ఫుటేజీ ఇచ్చారు.

English summary
trs offer to schemes to munugodu people. that value may 10 lakh crores
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X