ఇద్దరు..3 రోజులుగా మహిళపై లైంగికదాడి, మత్తు మందిచ్చి.. అధికార పార్టీ నేత పుత్రుడు..?

ఎన్ని చట్టాలు తెచ్చినా సరే మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఆడవారు కనిపిస్తే చాలు వారిలోని మృగం బయటకు వస్తుంటుంది. రోజుకో చోట ఇలాంటి లైంగికదాడులు, సామూహిక అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడలో కూడా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతిపై గ్యాంగ్ రేప్ చేశారు. అయితే ఆమె తెరుకోవడం మంచిది అయ్యింది. లేదంటే విషయం తెలిసేది కాదు.

కోదాడలో ఓ యువతిపై ఇద్దరు సామూహిక లైంగికదాడి చేశారు. 3 రోజుల నుంచి రేప్ చేస్తూనే ఉన్నారు. ఆ యువతికి మాయమాటలు చెప్పి తీసుకొచ్చారు. ఆటోలో తీసుకొచ్చి కూల్ డ్రింక్ బాటిల్‌లో‌‌ మత్తు మందు కలిపి తాగించారు. తర్వాత దాడి చేసి.. తమ కోరికను తీర్చుకున్నారు. మత్తు నుంచి తేరుకున్న యువతి వెంటనే బంధువులకు సమాచారం అందించింది. దీంతో విషయం తెలిసింది.

two men gangraped woman at kodad

ఆ యువతిని చికిత్స కోసం సూర్యాపేట జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని వెల్లడించారు. అయితే నిందితుల్లో ఒకరు అధికార పార్టీకి చెందిన నేత కుమారుడని తెలిసింది. మున్సిపల్ కౌన్సిలర్ కొడుకు అని విశ్వసనీయ సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.

అధికార పార్టీకి చెందిన నేత కుమారుడు లైంగికదాడి కేసులో నిందితుడు.. దీనిపై కౌన్సిలర్ ఇంతవరకు స్పందించలేదు. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. అధికారం ఇస్తే ఇదేనా పద్ధతి అంటూ నిలదీస్తున్నాయి. పట్టణంలో అందరినీ సోదరభావంతో చూడాల్సింది పోయి.. లైంగికదాడులకు తెగబడుతారా అని అడుగుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+