చేనేతలకు రుణమాఫీ, అర్హులకు సబ్సిడీపై రుణాలు, యంత్రాలకు ఉచిత విద్యుత్: షర్మిల
చేనేత కార్మికులకు వైఎస్ షర్మిల వరాల జల్లు కురిపించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా 28వ రోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా భువనగిరి నియోజకవర్గం భూదాన్ పోచంపల్లి మండలంలో పాదయాత్ర చేపట్టారు. వంకమామిడి గ్రామంలో పాదయాత్ర ప్రారంభం కాగా.. మహిళలు దారి పొడవునా కోలాటాలు ఆడి స్వాగతం పలికారు. అనంతరం శివారెడ్డిగూడెం క్రాస్ కు పాదయాత్ర చేరుకుంది. అక్కడి నుంచి దంతూర్ గ్రామం, జిబ్లక్ పల్లి, కనుముక్కుల గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. భూదాన్ పోచంపల్లికి పాదయాత్ర చేరుకుంది. అక్కడ ఆచార శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. గ్రామంలో నిర్వహించిన 'చేనేత సదస్సు'కు హాజరయ్యారు. చేనేత కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు.
చేనేత కార్మికులకు మంచి చేసిందంటే వైయస్ఆర్ మాత్రమేనని షర్మిల అన్నారు. చేనేత కార్మికులు రుణమాఫీ జరిగింది. రాయితీపై రుణాలు అందజేశారు. నూలు మీద పన్ను తగ్గించారు. సబ్సిడీపై ముడి సరుకులు అందజేశారు. ఇప్పుడున్న కేసీఆర్ చేనేతలను నట్టేట ముంచుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో చేనేత కార్మికులు ముఖ్య పాత్ర పోషించారు. తెలంగాణ వచ్చాక.. చేనేతల బతుకులు మారలేదు. రోజంతా కష్టపడినా రూ.200 కూలీ దక్కడం లేదు. ఇంటిల్లిపాది భార్యాభర్తలు, పిల్లలు నెలంతా కష్టపడితే రూ.10వేల ఆదాయం మాత్రమే వస్తోంది. చేనేత కార్మికులు పూట గడవడానికి ఎంతో కష్టపడుతున్నారు. మగ్గం పని చేసి చేసి, మోకాళ్లు దెబ్బతింటున్నాయి. కంటి సమస్యలు వస్తున్నాయి. రసాయనాలతో ఊపిరితిత్తులు పాడయి పోతాయి.

చేనేతల కార్మికుల తలరాతను మారుస్తాం అని షర్మిల హామీనిచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తాం అని చెప్పారు. అర్హులందరికీ సబ్సిడీపై రుణాలు అందజేస్తామని.. చేనేత యంత్రాలకు ఉచిత కరెంట్ అందిస్తామని వివరించారు. రంగులు, రసాయనాలు, ఇతర ముడి సరుకులు రాయితీపై అందజేస్తామన్నారు. కార్మికులందరికీ ఆరోగ్య బీమా కల్పించి, ఉచిత వైద్యం అందజేస్తాం. జీవిత బీమా సదుపాయం కల్పించి, ఆదుకుంటాం అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలన పోవాలి. వైయస్ఆర్ సంక్షేమ పాలన రావాలి. ఆత్మహత్యలు ఆగాలి.. అభివృద్ధి జరగాలి. ప్రజా సమస్యలపై పోరాటానికే తమ పార్టీ ఆవిర్భవించింది అని చెప్పారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications