• search
  • Live TV
నంద్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నంద్యాల‌లో ఎస్‌పీవై రెడ్డి గెలిస్తే జరిగేదేంటి..? గత సందర్బాలకు భిన్నంగా ఎమన్నా జరగుతుందా..?

|

అమరావతి/హైదరాబాద్ : మ‌రో ప‌ది రోజుల్లో ఎన్నిక‌ల ఫ‌లితాలు రాబోతున్నాయి. ఎన్నిక‌ల పోలింగ్ సంద‌ర్భంగా కొన్ని లోక్‌స‌భ స్థానాలపై ఉత్కంఠ రేగింది. హేమాహేమీలు బ‌రిలో ఉండ‌టంతో ఎవ‌రు గెలుస్తార‌న్న విష‌యంలో తీవ్ర చ‌ర్చ జరుగుతోంది. పోలింగ్ ముగిశాక కూడా ఎవ‌రు గెలుస్తార‌న్న దానిపై పెద్ద ఎత్తున చ‌ర్చ, బెట్టింగులు సాగుతున్నాయి. అయితే.. తాజాగా ఓ స్థానంపై అంద‌రిలోనూ తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. ఎన్నిక‌లు జ‌రిగే స‌మ‌యంలో ఈ స్థానం పెద్దగా చ‌ర్చకు రాక‌పోయినా.. తాజాగా మాత్రం అక్కడ ఎవరు గెలుస్తారన్నది ఆస‌క్తి రేపుతోంది. గెలిచే అభ్యర్థి జ‌న‌సేన పార్టీ అయితే ఏంజరుగుతుంది అనే చ‌ర్చ తారా స్థాయిలో నడుస్తోంది. ఇందుకు కార‌ణం జ‌న‌సేన త‌రపున పోటీ చేసిన ఆ అభ్యర్థి ప్రస్తుతం జీవించి లేక‌పోవ‌డ‌మే..! మ‌రి చ‌నిపోయిన అభ్యర్థి గెలిస్తే ఏం జ‌రుగుతుంది..? రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థికి విజ‌యం క‌ట్టబెడ‌తారా..? లేదా ఉప ఎన్నిక వ‌స్తుందా..? ఎన్నిక‌ల నిబంధ‌న‌లు ఏం చెబుతున్నాయి..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఉత్కంఠగా మారిన నంద్యాల ఫలితం..! జీవించిలేని అభ్యర్తి గెలిస్తే ఏంటి పరిస్థితి..!!

ఉత్కంఠగా మారిన నంద్యాల ఫలితం..! జీవించిలేని అభ్యర్తి గెలిస్తే ఏంటి పరిస్థితి..!!

క‌ర్నూలు జిల్లా నంద్యాల లోక్‌స‌భ ఇప్పుడు అంద‌రి నోళ్లలో నానుతోంది. ఇక్కడ టీడీపీ నుంచి శివానంద‌రెడ్డి, వైసీపీ నుంచి బ్రహ్మానంద‌రెడ్డి, జ‌న‌సేన త‌ర‌పున ఎస్‌పీవై రెడ్డి పోటీ చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో ఎస్పీవై రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ త‌ర్వాత టీడీపీలో కొంత‌కాలం పాటు కొన‌సాగారు. ఎన్నిక‌ల ముందు జ‌న‌సేన గూటికి చేరి, ఆ పార్టీ త‌ర‌ఫున పోటీ చేశారు. ప‌ది రోజుల కింద‌ట ఎస్‌పీవై రెడ్డి మృతి చెందారు. నాలుగు రోజుల కింద‌ట నంద్యాల స్థానం ఖాళీ అయిన‌ట్లు స్పీక‌ర్ కార్యాల‌యం కూడా ప్రక‌టించింది. అయితే.. ఎన్నిక‌ల పోలింగ్‌కు ముందు అభ్యర్థి చ‌నిపోతే.. స‌హ‌జంగా పోలింగ్‌ను ఎన్నిక‌ల సంఘం వాయిదా వేస్తుంది.

కన్ను మాసిన జనసేన అభ్యర్థి..! ఎన్నికల నియమావళి ఏం చెబుతోంది..!!

కన్ను మాసిన జనసేన అభ్యర్థి..! ఎన్నికల నియమావళి ఏం చెబుతోంది..!!

కానీ ఎన్నిక‌ల‌య్యాక చ‌నిపోవ‌డంతో ఫ‌లితాల వ‌ర‌కు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎస్‌పీవై రెడ్డి చ‌నిపోయారు క‌నుక ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలిస్తే ఏమ‌వుతుంద‌న్న చ‌ర్చ అంద‌రి మొదలైంది. మ‌ళ్లీ ఉప ఎన్నిక వ‌స్తుందా..? లేదా ఎస్పీవై రెడ్డి జీవించి లేరు క‌నుక రెండో స్థానం సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రక‌టిస్తారా.. ?అన్నది చ‌ర్చనీయాంశంగా మారింది. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల ప్రకారం పోలింగ్ ముగిశాక అభ్యర్థి చ‌నిపోతే.. ఆయ‌నకు పోలైన ఓట్లు కూడా లెక్కిస్తారు. ఈ సంద‌ర్భంగా అత‌ను విజేత‌గా నిలిస్తే.. ఎన్నిక‌ ర‌ద్దు అవుతుంది.

రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారా..! ఈసి నిర్ణయం ఏంటి..!!

రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారా..! ఈసి నిర్ణయం ఏంటి..!!

గెలిచిన అభ్యర్థి జీవించి లేడు క‌నుక తిరిగి ఉప ఎన్నిక జ‌రుగుతుంది. అంతేకానీ రెండోస్థానంలో నిలిచిన అభ్యర్థికి విజేతగా ప్రకటించే అవకాశాలు ఉండవు. ఆరు నెల‌ల్లోగా అక్కడ ఉప ఎన్నిక‌ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం చ‌ర్యలు తీసుకుంటుంది. అదే చనిపోయిన అభ్యర్థి గెల‌వ‌క‌పోతే, ఈ ఆలోచ‌నే అవ‌స‌రం ఉండదు. విజేత ఎలాగూ బ‌తికే ఉన్నాడు క‌నుక చ‌నిపోయిన అభ్యర్థి గురించి ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేదు. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ పోలింగ్‌కు 24 గంట‌ల ముందు ఆళ్లగ‌డ్డ వైసీపీ అభ్యర్థి శోభానాగిరెడ్డి మృతి చెందారు.

గతంలో శోభానాగిరెడ్డి ఇలాగే జీవించి లేరు..! ఉప ఎన్నిక అనివార్యం..!!

గతంలో శోభానాగిరెడ్డి ఇలాగే జీవించి లేరు..! ఉప ఎన్నిక అనివార్యం..!!

అయితే.. ఎన్నిక అప్పటిక‌ప్పుడు వాయిదా వేయ‌డం సాధ్యం కాదు క‌నుక ఎన్నిక‌ల సంఘం వాయిదా వేయ‌లేదు. ఆ ఎన్నిక‌ల్లో శోభానాగిరెడ్డి చ‌నిపోయింద‌ని తెలిసినా.. ఓట‌ర్లు ఆమెకే ప‌ట్టం క‌ట్టారు. ఆమెను విజేత‌గా ప్రక‌టించిన ఎన్నిక‌ల సంఘం.. ఆమె జీవించి లేక‌పోవ‌డంతో తిరిగి ఉప ఎన్నిక నిర్వహ‌ణ‌కు చ‌ర్యలు తీసుకుంది. ఆ తర్వాత జ‌రిగి ఉప ఎన్నిక‌లో ఆళ్లగ‌డ్డ నుంచి శోభానాగిరెడ్డి కుమార్తె భూమా అఖిల‌ప్రియ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈసారి నంద్యాల లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎస్‌పీవై రెడ్డి గెలిస్తే.. తిరిగి ఉప ఎన్నిక జ‌రుగుతుంది. ఎన్నికల నియమావళి కూడా ఇదే నిర్థారిస్తోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

నంద్యాల యుద్ధ క్షేత్రం
సంవత్సరం
అభ్యర్థి పేరు పార్టీ లెవెల్ ఓటు ఓటు రేట్ ఓట్ల తేడ
2019
పోచా బ్రహ్మానంద రెడ్డి వైయస్సార్‌సీపీ విజేతలు 7,20,888 55% 2,50,119
మాండ్ర శివానంద రెడ్డి టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 4,70,769 36% 2,50,119
2014
ఎస్.పి. రెడ్డి వైయస్సార్‌సీపీ విజేతలు 6,22,411 52% 1,05,766
యన్.యండి. ఫరూక్ టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 5,16,645 43% 0
2009
ఎస్ పి వై రెడ్డి కాంగ్రెస్ విజేతలు 4,00,023 40% 90,847
నయాసమ్ మొహమ్మద్ ఫర్ఖూ టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 3,09,176 31% 0
2004
ఎస్ పి వై. రెడ్డి కాంగ్రెస్ విజేతలు 4,58,526 55% 1,11,679
భుమా శోభా నాగి రెడ్డి టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 3,46,847 42% 0
1999
Bhuma Nagi Reddy టీడీపీ విజేతలు 3,91,655 54% 72,609
అలువాల సత్యనారాయణ కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 3,19,046 44% 0
1998
భుమా నాగి రెడ్డి టీడీపీ విజేతలు 3,38,100 48% 4,650
అలువాల సత్యనారాయణ కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 3,33,450 48% 0
1996
పి.వి.నారసింహరావు కాంగ్రెస్ విజేతలు 3,66,431 50% 98,530
భుమా వెంకట నాగిరెడ్డి టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 2,67,901 37% 0
1991
అలువాల సత్యనారాయణ కాంగ్రెస్ విజేతలు 3,77,556 60% 1,86,766
నల్లగట్లా నరసింహూలు టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 1,90,790 30% 0
1989
బోజ్జ వెంకట రెడ్డి కాంగ్రెస్ విజేతలు 3,70,097 54% 56,262
మాదురు సుబ్బ రెడ్డి టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 3,13,835 45% 0
1984
ఒసురి అంజి బాబు టీడీపీ విజేతలు 2,98,420 54% 50,263
పెందేకేంటి వెంకట సుబ్బయ్య కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 2,48,157 45% 0
1980
పి. వెంకట సుబ్బయ్య ఐ ఎన్సి( ఐ ) విజేతలు 2,19,606 56% 78,378
ఆసిఫ్ పాషా ఐ ఎన్సి(యు) రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 1,41,228 36% 0
1977
నీలం సంజీవ రెడ్డి బిఎల్డి విజేతలు 2,58,147 53% 35,743
పెంటకంటి వెంకట సుబ్బయ్య కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 2,22,404 46% 0
1971
రెండేకంటి వెంకట సుబ్బయ్య కాంగ్రెస్ విజేతలు 2,25,740 66% 1,30,456
కానాల అంకి రెడ్డి ఎన్సిఓ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 95,284 28% 0
1967
పి.వి.సుబ్బాయ్య కాంగ్రెస్ విజేతలు 2,62,256 66% 1,68,825
ఎస్ రెడ్డి సీపీఐ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 93,431 24% 0

English summary
Intresting topic going a head in Nadyal lok sabha constency.The debate over whether the candidate wins the janasena party is running at a level. This is because the applicant who has been competing for the JanaSena is not living right now! What happens if a dead candidate wins Will the success of the candidate in the second place win? Or the by election? What are the terms of election?

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more