యువతిని వివస్త్రను చేసి వికృత చేష్టలు.. గొర్రెల కాపరి అప్రమత్తతో తప్పిన ముప్పు

నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం జనార్ధన్ రెడ్డి కాలనీలో బుధవారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిని వివస్త్రను చేసిన కొందరు యువకులు వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

యువతిని వివస్త్రను చేసి వేధింపులు..

యువతిని వివస్త్రను చేసి వేధింపులు..

వివరాల్లోకి వెళితే.. మహమూర్ మసీదు వెనుక గొర్రెలమండీ ఉంది. ఈ ప్రాంతంలోకి ఎవరూ రాకపోవడంతో అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. కాగా, బుధవారం రాత్రి ఓ గొర్రెల అటువైపు వెళుతుండగా.. ఆ ఆటో నిలిపివుంది. అయితే, అనుమానం వచ్చిన అతడు అక్కడ ఏం జరుగుతుందోనని చూశాడు. అక్కడ జరుగుతున్న ఘటనను చూసి అతడు దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఓ యువతిని వివస్త్రను చేసిన కొందరు దుండగులు.. ఆమెకు బట్టలు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తున్నారు.

గొర్రెల కాపరి అప్రమత్తతో..

గొర్రెల కాపరి అప్రమత్తతో..

ఈ క్రమంలో గొర్రెల కాపరి తన దగ్గర ఉన్న టార్చ్‌లైట్‌ను అటువైపుగా వేయడంతో దుండగులు ఆటోలో పరారయ్యారు. ఆటో వెనుక ఓ సినిమా నటుడి స్టిక్కర్ ఉన్నట్లు గుర్తించాడు. ఆ తర్వాత గొర్రెల కాపరి ఆ యువతికి వస్త్రాలు ఇవ్వడంతో ఆమె అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని నవాబుపేట పోలీసులు తెలిపారు. అయితే, ఘటనపై విచారణ జరుపుతున్నామని చెప్పారు.

Recommended Video

    Director Sujeeth Gets Married To Pravallika | Oneindia Telugu
    బావ అని చెప్పి.. మూడు సార్లు అఘాయిత్యం..

    బావ అని చెప్పి.. మూడు సార్లు అఘాయిత్యం..

    ఇది ఇలావుండగా, ప్రకాశం జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒంగోలు రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ఓ ప్రాంతంలో ఉంటున్న ఓ యువతి స్థానికంగా ఓ దుకాణంలో పనిచేస్తోంది. కాగా, వరుసకు బావ అయ్యే వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ఆ యువతి రెండుసార్లు గర్భవతి అయ్యింది. అయితే, పలు మాత్రలు వాడి ఆమె గర్భాన్ని తొలగించాడు. మూడోసారి కూడా గర్భం దాల్చడంతో తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి అతడిపై ఒత్తిడి చేసింది. ఇందుకు సదరు వ్యక్తి నిరాకరించడంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+