నెల్లూరులో జనసేన విన్నూత్న నిరసన-రోడ్ల గుంతల చుట్టూ వైసీపీ ముగ్గులేసి మరీ..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల పరిస్ధితి అధ్వాన్నంగా మారిందని ఆరోపిస్తూ జనసేన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. గుడ్ మార్నింగ్ సీఎం సర్ అంటూ నినాదాన్ని పెట్టి మరీ జనసేన క్యాడర్ నిరసన తెలుపుతోంది. అయినా ప్రభుత్వం మాత్రం పాడైపోయిన రోడ్లపై స్పందించడం లేదు. దీంతో ఇవాళ నెల్లూరులో జనసేన కార్యకర్తలు విన్నూత్నంగా నిరసన తెలిపారు.
నెల్లూరులో జనసేన నేతలు వినూత్న నిరసన చేపట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో రోడ్ల అధ్వానంగా తయారయ్యాయంటూ థాంక్యూ సీఎం సార్ అని నినాదంతో నగరంలోని గుంతలు పడ్డ రోడ్ల వద్ద వైసీపీ రంగులతో కూడిన ముగ్గులు వేసి తమ నిరసన చేపట్టారు. జనసేన రాష్ట్ర నాయకుడు కేతమ్ రెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వానికి రోడ్లపై గతంలోనూ నిరసనలు తెలిపినా ఫలితం లేకపోవడంతో ఈ తరహా ఆందోళనలు చేపడుతున్నట్లు జనసేన నేతలు తెలిపారు.
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి పిలుపు మేరకు నెల్లూరు సిటీ నియోజకవర్గ @JanaSenaParty ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వం తీర్చిదిద్దిన "జగనన్న రోడ్డు"కి వైసీపీ రంగులు వేయడం జరిగింది.#GoodMorningCMSir pic.twitter.com/nb9QURfeC9
— Kethamreddy Vinod Reddy (@keathamreddy) July 15, 2022
ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం తీరుపై జనసేన నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ మూల చూసిన రోడ్లు అద్వానంగా తయారైపోయాయని, పాదచారులు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. బైకులు పై వెళ్తే నడుములు విరిగిపోతున్నాయని మండిపడ్డారు.

అయినా ప్రభుత్వం మాత్రం రోడ్లను కనీసం మరమ్మత్తులు చేయించేందుకు కూడా ముందుకు రావడం లేదన్నారు. అందుకే తాము వైసీపీ రంగులతోనే నిరసనలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రోడ్లను రిపేర్లు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications