వామ్మో.. ఏందిది... మహిళా కానిస్టేబుళ్లకు పురుషుల కొలతలు.. ఎక్కడంటే, ఫోటో తీస్తే కేసట

అసలే పోలీసు.. తాము సమానమేనని అంటున్నారు. యూనిఫామ్ వేసుకుంటున్నారు. కానీ వారి స్ట్రిచింగ్ ఇబ్బందికి గురిచేసింది. ఇదీ ఆంధ్రప్రదేశ్‌లో గల నెల్లూరు జిల్లాలో జరిగింది. మహిళా పోలీసుల యూనిఫామ్ కోసం పురుషులు కొలతలు తీసుకోవడం విమర్శలకు తావిచ్చింది. ఆత్మకూరు, కావలి డివజన్లలో యూనిఫామ్ కుట్టించే ప్రక్రియలో భాగంగా మగవారితో కొలతలు తీసుకున్నారు. దీనిపై సదరు మహిళా పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ డ్రెస్ సైజులు మగవారు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు.

పురుషులతో కొలతలు

పురుషులతో కొలతలు

ఆత్మకూరు, కావలి డివిజన్ పరిధిలోని మహిళా పోలీసులకు కొత్త యూనిఫామ్ కోసం స్థానిక ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో కొలతలు తీసుకుంటున్నారు. మగవారే మహిళల డ్రెస్ కొలతలు తీసుకున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఫొటోలు బయటకొచ్చాయి. మహిళా పోలీసుల డ్రెస్ కొలతలు తీసుకునేందుకు పురుష పోలీసులకు డ్యూటీ వేసినట్లు తెలిసింది. దీనిపై సదరు మహిళా పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మగవారు కొలతలు తీసుకోవడంతో తాము చాలా ఇబ్బంది పడ్డామని లేడీ కానిస్టేబుళ్లు వాపోయారు.

బయటకు ఫోటోలు

బయటకు ఫోటోలు

ఫోటోలు బయటికి రావడంతో కొలతలు తీసుకుంటున్న తీరు వివాదానికి దారితీసింది. వెంటనే పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. మహిళా పోలీసుల యూనిఫామ్‌కు సంబంధించిన టైలర్ మెజర్ మెంట్స్ బాధ్యతలను ఔట్ సోర్సింగ్‌కు అప్ప చెప్పామని నెల్లూరు ఎస్సీ విజయా రావు తెలిపారు. ఒక పురుషుడు కొలతలు తీసినట్లు తెలిసిన వెంటనే స్పందించి దానిని సరిదిద్దాం అన్నారు. మహిళా టైలర్లు.. మహిళా పోలీస్ సిబ్బంది కూడా వారిలోనే ఉన్నారని వెల్లడించారు. మహిళా పోలీసుల దుస్తుల కొలతలు తీసేందుకు మహిళలనే నియమించామని ఎస్పీ తెలియజేశారు. అనుమతి లేని ప్రదేశంలోకి ప్రవేశించి ఫోటోలు తీసి, మహిళల ప్రైవసీకి భంగం కలిగించిన వ్యక్తిపై చట్ట ప్రకారం చర్యలకు ఆదేశించారు.

లేడీ టైలర్స్ లేరా..?

లేడీ టైలర్స్ లేరా..?

ఇటు ఈ అంశంపై ప్రతిపక్ష టీడీపీ స్పందించింది. జగన్‌ పాలనలో మహిళా భద్రత గాల్లో దీపమేనని టీడీపీ నేత అనిత అన్నారు. నెల్లూరులో మహిళా పోలీసుల పట్ల వ్యవహరించిన తీరు దారుణం అని అభివర్ణించారు. మహిళా పోలీసులకు మగ టైలర్‌తో కొలతలు తీయించడం సరికాదన్నారు. యూనిఫాం కుట్టేందుకు లేడీ టైలర్స్ లేరా?, పోలీస్ వృత్తిలో ఉన్న మహిళల పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు. దీనిపై సీఎం, హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+