కోటంరెడ్డిపై సంచలన ఆరోపణ- రెక్కీ: నెల్లూరు సంచరిస్తోన్న కొత్త ముఖాలు..!!
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ కార్పొరేటర్ భాస్కర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
నెల్లూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై సంచలన ఆరోపణ చేశారు స్థానిక కార్పొరేటర్. పార్టీలో తిరుగుబాటు జెండా లేవనెత్తినప్పటి నుంచీ కోటంరెడ్డి రోజూ వార్తల్లో ఉంటోన్నారు. అత్యంత వివాదాస్పదమైన ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఆయన తెర మీదికి తీసుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం అంత సులువు కాదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నప్పటికీ- ఈయన ఈ ఆరోపణలకే కట్టుబడి ఉన్నారు. ఆ కారణంతోనే తాను పార్టీకి దూరమౌతున్నాననీ వివరించారు.

కోటంరెడ్డిపై కేసు..
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై ఇప్పటికే నెల్లూరు వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మరో ఇద్దరిపై కేసు పెట్టారు. నెల్లూరు 22వ డివిజన్ కార్పొరేటర్ మూలె విజయ భాస్కర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు వేదాయపాళెం పోలీసులు. దౌర్జన్యంగా ఇంట్లోకి చొరబడి, తనను కిడ్నాప్ చేశారంటూ భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీనితో కోటంరెడ్డిపై ఐపీసీ సెక్షన్ 448, 363 ఆర్/డబ్ల్యూ 34 కింద కేసు ఫైల్ చేశారు.

ఆదాలకు మద్దతు..
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్థానంలో నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం కోఆర్డినేటర్ గా లోక్ సభ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించిన విషయం తెలిసిందే. దీని తరువాత మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అధికార వైఎస్‌ఆర్సీపీ కార్పొరేటర్లు ఆదాల ప్రభాకర్ రెడ్డికి మద్దతు తెలిపారు. వారిలో మూలె విజయభాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు.

వైసీపీలో కొనసాగుతున్నందున..
ఇవ్వాళ ఆయన మీడియా ముందుకొచ్చారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తాను వైఎస్సార్‌సీపీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నానని, దీనితో కోటంరెడ్డి తనపై ఆగ్రహంతో ఉన్నారని భాస్కర్ రెడ్డి ఆరోపించారు. ఆయన డ్రైవర్ అంకయ్య, మరో వ్యక్తితో కలిసి ఇంటికి వచ్చిన కోటంరెడ్డి తనను బలవంతంగా వాహనంలోకి తరలించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నందున కోటంరెడ్డి బెదిరించారని ఆయన ఆరోపించారు.

కొత్త ముఖాలు..
ఎప్పుడూ చూడని కొత్త వ్యక్తులు తన ఇళ్లు, కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని కార్పొరేటర్ భాస్కర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తన కదలికలను ఎప్పటికప్పుడు వారు సెల్ ఫోన్ల ద్వారా చిత్రీకరిస్తున్నారని, పసికడుతున్నారనే సమాచారం అందిందని అన్నారు. తనపై రెక్కీ నిర్వహించి ఉండొచ్చని చెప్పారు. ఎప్పుడేం జరుగుతుందోననే ఆందోళనలో తన కుటుంబ సభ్యులు ఉన్నారని భాస్కర్ రెడ్డి చెప్పారు. తనకు న్యాయం చేయాలని కోరారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్సీపీని వదిలేది లేదని, ఆదాల ప్రభాకర్ రెడ్డి వైపే ఉంటానని స్పష్టం చేశారు.

భద్రత కుదింపుతో..
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భద్రతను ఇటీవలతగ్గించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ఎమ్మెల్యే హోదాలో ప్రస్తుతం ఆయనకు కల్పిస్తోన్న భద్రతలో కోత పెట్టింది. 2+2 గా ఉన్న సెక్యూరిటీని 1+1కు తగ్గించింది. భద్రతను తగ్గిస్తూ జారీ చేసిన అధికారిక ఉత్తర్వులపై కోటంరెడ్డి తన అంగీకారాన్ని తెలియజేశారు. జిల్లా పోలీసు అధికారులు తనకు అందజేసిన డాక్యుమెంట్లపై సంతకం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య విమర్శలకు దారి తీస్తోంది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications