నెల్లూరు చేరిన ప్లాంట్.. ప్రాణవాయువు ఉత్పత్తి, సోనూ సూద్ గ్రేట్
సాయం చేయడమే ఆయనకు తెలుసు.. అతనే సోనూ సూద్. కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ విధించిన తొలినాళ్ల నుంచి ఆయన మంచితనం ప్రపంచానికి తెలిసింది. సాయం చేయమని కోరితే చాలు.. ఇట్టే హెల్ప్ చేస్తున్నారు. అలా ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో మంచి పని చేశారు. ఇటీవల విద్యార్థుల కోసం ఏకంగా టవర్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారు.

ప్రాణవాయువు కొరత
కరోనా సెకండ్ వేవ్ వల్ల ఆక్సిజన్ సమస్య ఏర్పడింది. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు ఆక్సిజన్ కొరతను ఎదుర్కొన్నాయి. ఆక్సిజన్ అందక చాలా మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్ కోసం రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తే పరిస్థితి ఏర్పడింది. కరోనా తొలినాళ్ల నుంచి సినీ నటుడు సోనూసూద్ ఎందరో అభాగ్యులకు అండగా నిలిచారు. సాయం కోరిన ప్రతి వ్యక్తి, ప్రతీ ఒక్కరికీ తన వంతు సాయం చేస్తూ సేవలు అందిస్తూ వస్తున్నారు. తాజాగా ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ ప్లాంటును నెలకొల్పారు.

నెల్లూరుకు ప్లాంట్..
నెల్లూరులో ఆక్సిజన్ ప్లాంట్ నెలకొల్పేందుకు విదేశాల నుంచి ప్లాంటు తెప్పించారు. ప్లాంటు నెల్లూరుకు చేరుకుందని ఈ మేరకు సోను సూద్ ట్వీట్ చేశారు. ఆక్సిజన్ ప్లాంట్ నెల్లూరుకు చేరుకుందని చెప్పడానికి సంతోష పడుతున్నానని చెప్పారు. ప్రాణ వాయువు త్వరలోనే తయారు కాబోతోందని తెలిపారు. తాను ఎంతో అభిమానించే రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు మరిన్ని ఇతర రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు.
గ్రేట్..
నిజంగా గ్రేట్.. ఏ సమస్య అయినా సరే.. అదీ ఏ రూపంలో ఉన్న సరే.. మీకు సోనూ సూద్ ఉన్నారు. కరోనా వల్ల ఆరోగ్య సమస్య రావడంతో.. ఏకంగా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశాడు. నిజంగా అతని మంచి మనసుకు అందరూ శభాష్ అంటున్నారు. పదికాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు. మీ లాంటి వాళ్లు ఉంటేనే మిగతా అభాగ్యులకు మేలు జరుగుతుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications