నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏంటీ చెంచు కృష్ణ.. ఇంటర్‌లోనే ప్రేమా.. కాదంటే కత్తితో దాడా..?

|
Google Oneindia TeluguNews

ప్రేమ పేరుతో దాడులు పెరుగుతున్నాయి. ప్రేమో.. ఆకర్షణో తెలియని వయసులో యువత పెడదారులు పడుతున్నారు. దాడి చేసి.. మరీ తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. యువతి ఇంటికి వెళ్లి మరీ ఆమె గొంతుకోసి పారిపోయాడు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటన కలకలం రేపింది.

వెంకటగిరిలో యువకుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. కాలేజిమిట్ట ప్రాంతంలో ఇంటర్ విద్యార్థినిపై కత్తితో దాడి చేశాడు. వాస్తవానికి వారికి ప్రేమ.. ఆకర్షణో తెలియదు. కానీ తనను ప్రేమించడం లేదనే కోపంతో ఉన్మాదానికి తెగపడ్డాడు. బాధిత యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రేమోన్మాది చెంచుకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంత కాలంగా యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడుతున్నాట. ప్రేమించాలని వేధింపులకు గురిచేశాడు. యువతి విషయం కుటుంబ సభ్యులకు చెప్పగా.. కుటుంబ సభ్యులు మందలించారు.

psycho krishna attacked inter student

సోమవారం ఎవరూ లేని సమయంలో యువతి ఇంట్లోకి వెళ్లిన కృష్ణ.. యువతిపై కత్తితో దాడి చేశాడు. కేకలు వేస్తూ యువతి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు యువతిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉంది. దాడి అనంతరం ఇంటికి పారిపోయిన ప్రేమోన్మాది కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మైనర్ బాలికపై చెంచు కృష్ణ అనే వ్యక్తి కొన్నిరోజులుగా ప్రేమించాలని వెంటబడుతున్నాడని నెల్లూరు జిల్లా ఎస్పీ విజయారావు తెలిపారు. ప్రేమించలేదనే కారణంతో కత్తితో గొంతుపై గాయపరిచాడన్నారు.మెరుగైన చికిత్స కోసం తిరుపతి తరలించడం జరిగిందన్నారు. అతనిపై 354డి, 452, 324, 307, సెక్షన్ 9, 10 ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇలాంటి ఉన్మాద చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

ఇటీవల ఇలాంటి దాడులు మరీ పెరుగుతున్నాయి. ఆకర్షణను చూసి ప్రేమ అనుకొని దాడులు చేస్తున్నారు. జీవితం, భవిష్యత్ గురించి ఆలోచించకుండా దాడి చేస్తున్నారు. క్షణికావేశంలో చేసే దాడి.. వారి జీవితాలనే కాదు.. మరొకరి జీవితాన్ని నాశనం చేస్తుంది. దీనిపై యువతకు అవగాహన కల్పించిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది.

English summary
psycho krishna attacked inter student. police are arrested culprit. incident happened at nellore
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X