శ్రీహరి కోట నుంచి మరో రాకెట్.. PSLV-C43 కౌంట్ డౌన్ ప్రారంభం
Recommended Video

సూళ్లూరుపేట : శ్రీహరికోట షార్ సెంటర్ మరో అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైంది. గురువారం ఉదయం 9 గంటల 58 నిమిషాలకు PSLV-C43 రాకెట్ ను అంతరిక్షంలోకి పంపేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి బుధవారం ఉదయం 5 గంటల 58 నిమిషాలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇది 28 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగి అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. మన దేశానికి చెందిన HYSIS ఉపగ్రహంతో పాటు అమెరికాకు చెందిన 23 ఉపగ్రహాలు, స్పెయిన్, ఆస్ట్రేలియా, మలేషియా, కెనడా, నెదర్లాండ్స్, కొలంబియా, ఫిన్‌లాండ్ దేశాలకు చెందిన ఒక్కో ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది ఈ రాకెట్.

HYSIS ఉపగ్రహంతో 630 కిలోమీటర్ల పైభాగం నుంచి భూమిపై క్లియర్ గా కలర్ చిత్రాలను చూసే వీలుంది. దీంతో తీర ప్రాంతాల్లో నీరుపై అంచనాలు రూపొందించవచ్చు. అలాగే వ్యవసాయం, అటవీ ప్రాంతాలకు సంబంధించిన వివరాలు సులభంగా పొందే ఛాన్సుంటుంది.












Click it and Unblock the Notifications