Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోలీస్ స్టేషన్ లో బైఠాయించిన కోటంరెడ్డి- హీటెక్కిన నెల్లూరు

వైఎస్ఆర్సీపీకి చెందిన నెల్లూరు రూరల్ తిరుగుబాటు శాసన సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆందోళనకు దిగారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆయన బైఠాయించారు.

నెల్లూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆందోళనకు దిగారు. రాత్రి వేళ పోలీస్ స్టేషన్ లో బైఠాయించారు. కోటంరెడ్డి పోలీస్ స్టేషన్ లో ఆందోళకు దిగిన సమాచారం తెలిసిన వెంటనే ఆయన అనుచరులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆయనకు మద్దతుగా నిలిచారు. అనుకూలంగా నినాదాలు చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినదించారు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతలకు దారి తీసింది. జిల్లా రాజకీయాల్లో కలకలం రేపింది.

కోటంరెడ్డి ప్రధాన అనుచరుడు తాటి వెంకటేశ్వర్లు అరెస్ట్ వ్యవహారం ఈ ఘటనకు దారి తీసింది. తాటి వెంకటేశ్వర్లును వేదాయపాలెం పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలియగానే ఆయన పోలీస్ స్టేషన్ కు బయలుదేరి వెళ్లారు. అక్కడే బైఠాయించారు. తాము ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదంటూ పోలీసులు తెలియజేసినప్పటికీ వినిపించుకోలేదు. తాటి వెంకటేశ్వర్లును అక్రమంగా అరెస్ట్ చేశారని, రికార్డుల్లో చేర్చలేదంటూ మండిపడ్డారు.

 YSRCP rebel MLA Kotamreddy Sridhar Reddy has protest in a Police Station after his follower arrest

చాలాసేపటి వరకు ఆయనను పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు గానీ అవి ఫలించలేదు. దీనితో నెల్లూరు డీఎస్పీ రంగంలోకి దిగారు. కోటంరెడ్డితో ఫోన్ లో మాట్లాడారు. తాటి వెంకటేశ్వర్లును తాము అరెస్ట్ చేయలేదని, సమాచార లోపం వల్ల అది ప్రచారం జరిగి ఉండొచ్చని డీఎస్పీ ఆయనను వారించారు. దీనికి కోటంరెడ్డి సానుకూలంగా స్పందించలేదు. అక్రమంగా తన అనుచరుడిని అరెస్ట్ చేశారంటూ ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు.

24 గంటల్లోగా తాటి వెంకటేశ్వర్లు అరెస్టును చూపించకపోతే న్యాయపోరాటానికి దిగుతానని హెచ్చరించారు. ప్రభుత్వానికి ఎదురు తిరిగినంత మాత్రాన తనను అనేక ఇబ్బందులకు గురి చేస్తోన్నారంటూ ధ్వజమెత్తారు. ఉద్దేశపూరకంగా తనతో పాటు తన అనుచరులను బెదరిస్తోన్నారంటూ ఆరోపించారు. రాజకీయంగా తనను ఏకాకిని చేయాలనే కారణంతోనే పోలీసులు తనపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటూ విమర్శించారు.

ప్రభుత్వం తనను ఏ రకంగా ఇబ్బందలకు గురి చేస్తోందో.. పోలీసులను ఎలా ప్రయోగిస్తోందో ప్రజలకు తెలియజేస్తానని అన్నారు. శనివారం మీడియా ముందుకు వస్తానని అన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టబోతోన్నానని కోటంరెడ్డి చెప్పారు. ఇదివరకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రధాన అనుచరులు జావెద్, మన్నేపల్లి రఘును పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే ప్రచారం నెల్లూరులో పెద్ద ఎత్తున జరిగింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+