రంగంలోకి దిగిన ఆదాల- నెల్లూరులో..!!

వైఎస్ఆర్సీపీకి చెందిన నెల్లూరు ఎంపీ, రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి- పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. కీలక వ్యాఖ్యలు చేశారు.

నెల్లూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వంటి జిల్లాల్లో నెల్లూరూ ఒకటి. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ఈ జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. లోక్ సభతో పాటు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను తన ఖాతాలో వేసుకుంది. 2014 నాటి ఎన్నికల్లోనూ తెలుగుదేశం-బీజేపీ ప్రభంజనాన్ని తట్టుకుని కూడా వైసీపీకి పట్టం కట్టిందీ జిల్లా. అలాంటి చోట వైఎస్ఆర్సీపీలో అసంతృప్తి, అసమ్మతి గళం వినిపిస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

 ఆనంతో మొదలు..

ఆనంతో మొదలు..

మొన్నటికి మొన్న సీనియర్ నాయకుడు, తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన వైఎస్ఆర్సీపీ శాసన సభ్యుడు ఆనం రామనారాయణ రెడ్డి.. అధికార పార్టీపై తిరుగుబాటు బావుటా లేవదీశారు. సొంత పార్టీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.. బహిరంగంగానే. ప్రభుత్వ పెద్దలను విమర్శించారు. అధికార యంత్రాంగాన్నీ తప్పుపట్టారు. మంత్రి పదవి లభించకపోవడం వల్లే ఆయన పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పారనే విషయం బహిరంగ రహస్యమే.

 కోటం కూడా..

కోటం కూడా..

ఇప్పుడు అదే బాటలో నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నడుస్తోన్నారు. కొంతకాలంగా తరచూ వార్తల్లో నిలుస్తోన్నారు. వైఎస్ఆర్సీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా ముద్ర ఉన్న ఆయన- జిల్లా అధికార యంత్రాంగంపై తరచూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో ఆయనను వైఎస్ జగన్ తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు గానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. కోటంరెడ్డి తిరుగుబాటు జెండా లేవనెత్తారు.

 ఇద్దరికీ చెక్..

ఇద్దరికీ చెక్..

ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలకు ఏకకాలంలో చెక్ పెట్టారు వైఎస్ జగన్. ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న వెంకటగిరి నియోజకవర్గం ఇన్ ఛార్జ్ బాధ్యతలను నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి అప్పగించారు. అదే సమయంలో కోటంరెడ్డి నియోజకవర్గం నెల్లూరు రూరల్ లో పార్టీ లోక్ సభ సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డిని రంగంలోకి దించారు. అప్పటికప్పుడు నివారణ చర్యలను తీసుకున్నారాయన.

 కార్యకర్తలతో భేటీ..

కార్యకర్తలతో భేటీ..

ఈ పరిణామాల మధ్య ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇవ్వాళ- పార్టీ నాయకులు, కార్యకర్తలతో తన నివాసంలో సమావేశం అయ్యారు. నారాయణ రెడ్డి పేట, కోడూరుపాడు ప్రాంతాల వారికి వీలైనంత త్వరగా ఇళ్ల‌ పట్టాలను ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. 2014లో పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని గుర్తు చేశారు. త్వరలోనే తాను నారాయణరెడ్డి పేట, కోడూరుపాడు ప్రాంతాల్లో పర్యటిస్తానని చెప్పారు. ఎలాంటి చిక్కులు, వివాదాలు లేని స్థలాలను పరిశీలించి, పట్టాలుగా పంపిణీ చేయడానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.

 రూరల్ లో గెలుపు..

రూరల్ లో గెలుపు..

2024 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు రూరల్ లో గెలుపు బావుటా ఎగరేయాల్సి ఉంటుందని ఆదాల ప్రభాకర్ రెడ్డి గుర్తు చేశారు. 2019 నాటి కంటే భారీ మెజారిటీని సాధించాల్సి ఉంటుందని చెప్పారు. వైఎస్ జగన్ తనపై నమ్మకంతో రూరల్ నియోజకవర్గం బాధ్యతలను తనకు అప్పగించారని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము కానివ్వబోనని అన్నారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కంచుకోట అనే పేరును సార్థకం చేద్దామని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+