యువతిపై సామూహిక లైంగికదాడి.. ఒకరి తర్వాత ఒకరు, 12 మంది..
నిర్భయ లాంటి కఠిన చట్టాలు తీసుకొచ్చినా యువతలో మార్పు రావడం లేదు. ప్రతీ రోజు ఎక్కడో చోట లైంగికదాడులు జరుగుతూనే ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ యువతికి డబ్బులు ఇస్తామని చెప్పి పది మందికి పైగా యువకులు గ్యాంగ్ రేప్ చేశారు. ఆ సమయంలో పెట్రోలింగ్ వాహనం రావడంతో వారంతా ఉడాయించారు. కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో జరిగిన ఘటన కలకలం రేపుతోంది.

ప్రమాదానికి గురైన సోదరి...
ఎడపల్లికి చెందిన మహిళ రెండ్రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. ఆమెను సోదరి నిజామాబాద్‌లో గల ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించింది. అయితే సోమవారం రాత్రి యువతి రైల్వే స్టేషన్ సమీపంలోకి వెళ్లింది. ఒంటరిగా ఉన్న ఆమెను విక్కీ అనే యువకుడు మాట కలిపాడు. డబ్బులు అవసరం ఉందని చెప్పగా.. ఇస్తానని చెప్పి నమ్మించాడు.

కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో లైంగికదాడి..
కలెక్టరేట్ వద్ద గల ధర్నా చౌక్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. రెవెన్యూ భవన్‌కు సంబంధించి ఖాళీ గదిలో లైంగికదాడి చేశాడు. తర్వాత అతని స్నేహితులు 11 మంది అక్కడకు చేరుకున్నారు. ఒకరి తర్వాత లైంగికదాడి చేశారు. ఆ సమయంలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం రావడం చూసి.. అక్కడి నుంచి పారిపోయారు. అర్ధరాత్రి సమయంలో అచేతనంగా కనిపించిన బాధితురాలిని పెట్రోలింగ్ సిబ్బంది ప్రశ్నించారు. దీంతో జరిగిన దారుణాన్ని యువతి పూసగుచ్చినట్టు వివరించింది.
Recommended Video

హమాల్‌వాడీకి చెందిన యువకులు
యువతిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యువతిపై గ్యాంగ్ రేప్ చేసిన వారిని పోలీసులు గుర్తించారు. హమాల్‌వాడీకి చెందిన యువకులని అని పేర్కొన్నారు. విక్కీ పెయింటర్‌గా పని చేస్తాడని వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు తెలిపారు. పెట్రోలింగ్ సిబ్బంది సమాచారం మేరకు ఎనిమిది మంది వరకు లైంగికదాడి చేసి ఉండొచ్చని ఆయన చెప్పారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications