ప్రాణం తీసిన టీవీ సౌండ్.. ఇంటి ఓనర్‌పై దాడి, కుప్పకూలి చనిపోయిన యజమాని..
ఇల్లు కిరాయికి ఇచ్చేటప్పుడు మంచి, మర్యాదతోపాటు.. వారి ప్రవర్తన, భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతాయా అని కూడా తెలుసుకొండి. లేదంటే ఇంటి ఓనర్ ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ఇంట్లో కిరాయికి ఉన్న వ్యక్తి.. ఏకంగా యాజమానినే హత్య చేశాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేగింది.
ఆర్మూర్‌లోని గోల్‌బంక్ ప్రాంతంలో రాజేందర్ దంపతులు ఉంటున్నారు. వీరి సంసారం సవ్యంగా సాగుతోంది. అయితే వీరి ఇంట్లోకి బాలనర్సయ్య ఫ్యామిలీ అద్దెకు దిగింది. వీరు కూడా మమూలుగానే ఉండేవారు. కానీ ఇటీవల మాత్రం గొడవలు జరుగుతున్నాయి. పక్కనే ఉంటోన్న యాజమాని రాజేందర్ దంపతులు ఇబ్బంది పడుతోన్నారు. తీరు మార్చుకోవాలని సూచించినా.. మార్పు రావడం లేదు.

Recommended Video

శుక్రవారం రాత్రి బాలనర్సయ్య దంపతులు గొడవకు దిగారు. ఇంట్లో ఉన్న రాజేందర్ విసుగెత్తిపోయాడు. గొడవ జరుగుతుందోనని.. లేదా సరదా కోసమే టీవీ సౌండ్ పెంచారు. దీంతో రాజేందర్ ఫ్యామిలీ కబుర్లు చెప్పుకొని ఉంది. పక్క నుంచి బాలనర్సయ్య వచ్చి.. టీవీ సౌండ్ గురించి చర్చించారు. అలా ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఇంకేముంది కోపోద్రిక్తుడైన బాలనర్సయ్య.. తన యాజమాని తలపై కర్రతో బలంగా కొట్టాడు. దీంతో రాజేందర్ కుప్పకూలి పడిపోయాడు. తీవ్ర గాయం కావడంతో చనిపోయాడు. వెంటనే బాలనర్సయ్య ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు బాలనర్సయ్య ఆచూకీ కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications