రేవంత్ ఓ.. అర్వింద్ విమర్శలు, సంజయ్‌తో సంబంధం లేదు..
రాష్ట్రంలో పొలిటికల్ హీట్ నెలకొంది. హుజురాబాద్ బై పోల్ వేళ.. పాదయాత్రలతో మరింత హీటెక్కిస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతల మధ్య మాటల మంటలు నెలకొన్నాయి. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ గురించి కూడా కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు దిక్కు లేరు, డబ్బులిచ్చి కార్యక్రమాలకు రప్పిస్తున్నారని విమర్శించారు.
టీపీసీసీ ప్రైసిడెంట్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ అర్వింద్ స్పందించారు. మంగళవారం బాన్సువాడ, బోధన్ నియోజకవరర్గాల నుంచి బీజేపీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరని చెప్పారు. పోటీ చేసిన వారికి డిపాజిట్లలో సగం ఓట్లు కూడా రావని చెప్పారు. తన సోదరుడు డి సంజయ్ గురించి కూడా స్పందించారు. సంజయ్‌తో తనకు చిన్నప్పటి నుంచే ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇక ముందు ఉండదని అర్వింద్ తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓ సెఫ్టిక్ ట్యాంక్ లాంటి వాడని అర్వింద్ అన్నారు. అలాంటి రేవంత్ రెడ్డిపై ఎలాంటీ కామెంట్ చేయనని, దూరంగా ఉంటానని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి బుత్ లేవల్ నుంచి కార్యకర్తలు కరువయ్యారని పేర్కొన్నారు. ఆ పార్టీ నాశనం కావాడానికి ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ కారణం అన్నారు.. మరోవైపు రేవంత్ రెడ్డికి బాగా ప్రెషర్ ఉందని, ఓ పక్క ఈడీ, మరోపక్క ఏసిబీ ఒత్తిడి ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో లొట్టపీస్ కూడా లేదని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీకి బలమైన కార్యకర్తలు లేకపోవడంతోపాటు.. బలమైన అభ్యర్ధులు కూడా లేరని అన్నారు.. డీ.శ్రీనివాస్ పిసిసిగా ఉన్న సమయంలో ఒక్క రాష్ట్రంలోనే 36 పార్లమెంట్ సీట్లు వచ్చాయని.. మరోసారి 34 పార్లమెంట్ సీట్లు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 36 మంది ఎంపిలు కూడా లేరని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకు పోయిందన్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి బీజేపీని సైతం విమర్శిస్తున్నారు. అటు కేంద్రంలో బీజేపీ, ఇటు రాష్ట్రంలో కేసీఆర్ పాలన ప్రజలను మభ్యపెడుతుందని అన్నారు. టీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న అవినీతి ఆరోపణలపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications