అపార కాళిలా మారిన యువతి, వేధిస్తోన్న యువకుడికి దేహాశుద్ది
ప్రేమ పేరుతో వెంటపడి వేధిస్తున్న ఓ పోకిరీకి ఓ యువతి బుద్ధి చెప్పింది. నడిరోడ్డుపై చెప్పుతో కొట్టింది. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఆకతాయి.. యువతిని వెంబడించి.. వేధించాడు. దగ్గరికొచ్చి ఫోన్ నెంబర్ ఇవ్వాలని బెదిరించాడు. నెల రోజులుగా అతడు ఇలా వేధిస్తున్నాడు. ఆకతాయి వేధింపులతో విసుగు చెందిన ఆ యువతి సహనం కోల్పోయింది. ఊరుకుంటే లాభం లేదనుకుంది. అపరకాళి అవతారం ఎత్తింది.
గల్లా పట్టుకుని చితకబాదింది. కాళ్లతో తంతూ పిడిగుద్దులు కురిపించింది. అంతటితో ఆమె కోపం చల్లారలేదు. చెప్పుతో చితక్కొట్టింది. రోడ్డు మీద వెళ్తున్న వాళ్లు ఇది గమనించి అక్కడికి వచ్చారు. జరిగింది ఆ యువతి వారికీ చెప్పింది. దీంతో వారు ఆకతాయిని పట్టుకోవడంతో.. యువతి మరో నాలుగు పీకింది.

ప్రేమ పేరుతో నెల రోజులుగా తనను వేధిస్తున్నాడని ఆ యువతి వాపోయింది. ఇంటి నుంచి వీధిలోకి రాగానే తన వెంటనే పడే వాడని.. మధ్యలో మాటలు కలిపేందుకు ప్రయత్నించేవాడని తెలిపింది. మాట్లాడుకుందామని ఫోన్ నెంబర్ కావాలని అడిగేవాడని, చాలా రోజుల పాటు పట్టించుకోలేదని తెలిపింది. వదిలి పెట్టలేదని, చివరికి ప్రేమిస్తున్నానని మాటలు చెప్పడంతో ఇలా స్పందించానని తెలిపింది.
యువతి ధైర్యాన్ని స్థానికులు మెచ్చుకున్నారు. పోకిరీకి సరైన రీతిలో సమాధానం చెప్పిందని ప్రశంసించారు. పోకిరీలకు.. చెప్పుతో బుద్ది చెప్పకపోతే.. మరింత రెచ్చిపోతారని కామెంట్ చేశారు.












Click it and Unblock the Notifications