జంబలకిడి పంబ.. వధువు అవతారంలో వరుడు, నోరెళ్లబెట్టిన జనం.. ఎక్కడంటే
జంబలకిడి పంబ.. ఆ మూవీలో ఆడాళ్లు, మగవారిలా... వారు, వీరిలా మారతారు. సినిమా కడుపుబ్బ నవ్విస్తోందనుకొండి.. కానీ రియల్ లైఫ్‌లో ఊహించుకోలేం. అవును అమ్మాయి, అబ్బాయిలా.. అబ్బాయి.. అమ్మాయిలా మారే పరిణామం సమాజం చూడదు.. చూసి తట్టుకునే పరిస్థితి ఉండదు. అయితే ప్రకాశం జిల్లాలో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. పెళ్లి కొడుకు వధువులా వేషం ధరించాడు. అతనిని రెడీ చేసిందే అతని కుటుంబం.. మరీ ఆ వివరాలు తెలుసుకుందాం. పదండి.

ఆచారం మేరకు.. కానీ
కుల ఆచారాలను ప్రజలు తూ.చ తప్పకుండా ఆచరిస్తున్నారు. తమ వంశ ఆచారం మేరకు నడచుకుంటున్నారు. పెళ్లి మండపానికి వెళ్ళవలసిన పెళ్ళికొడుకు, పెళ్లికూతురి అవతారం ఎత్తాడు. కుటుంబ సభ్యులు మేళతాళాలతో సంబరాలు జరుపుకున్నారు. కుల దైవం వద్దకు తీసుకువెళ్లారు. వంశపారంపర్యంగా వస్తున్న ఆచారాలలో భాగంగా వేడుక నిర్వహించారు.

నోరెళ్లబెట్టిన జనం
ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలో ఘటన జరిగింది. గొట్లగట్టు గ్రామానికి చెందిన నాలి రామయ్య కుమారుడు యోగేంద్ర బాబుకు వివాహం నిశ్చయ్యమైంది. తమ వంశ ఆచారంలో భాగంగా వరుడు పెళ్లి కూతురిలా కాసేపు మారాడు. ఆ ఫ్యామిలీ వరకు ఓకే కానీ.. మిగతా వారు మాత్రం ఆశ్చర్యపోయారు. అయ్యో ఇదేం విడ్డూరం అంటూ నోరెళ్లబెట్టారు. కానీ ఫ్యామిలీ మాత్రం అవేం పట్టించుకోలేదు.

చీరకట్టుకొని
ఆ వరుడు ప్యాంటు షర్ట్‌కు బదులు చీర జాకెట్ ధరించాడు. బారెడు విగ్గు పెట్టుకొని తలనిండా పూలు ధరించాడు. పెళ్లికూతురులా ముస్తాబయ్యాడు. తమ ఇలవేల్పు గురప్ప స్వామికి మొక్కు సమర్పించాడు. వారి ఆచారాలలో పెళ్లికూతురిని పెళ్ళికొడుకుగా, పెళ్లి కొడుకు పెళ్లికూతురుగా అలంకరించి స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు. అనాదిగా వస్తున్న ఈ సంస్కృతిని కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ ఆ ఊరికి కొత్తగా వచ్చినవారికి.. ఆ వైపు వెళ్లేవారు మాత్రం ఆశ్చర్యపోయారు. ఇదేం పని అని ముక్కున వేలేసుకున్నారు. కానీ ఆ ఫ్యామిలీ మాత్రం పట్టనట్టు వ్యవహరించింది. ఎందుకంటే తమకు కులదైవం ఇంపార్టెంట్ అని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications