పాస్టర్ పాడుపని: స్వీటు ఇస్తానని చిన్నారిపై లైంగికదాడి, రెండోసారి.. పోక్సో కింద కేసు
పాస్టర్.. చర్చిలో ప్రార్థనలు చేసే మంచి స్థానంలో ఉంటారు. అయితే కొన్నిచోట్ల మాత్రం వక్రబుద్ది చూపిస్తుంటారు. దీంతో ఆ వ్యవస్థకే కళంకం వస్తోంది. ఒకరిద్దరూ చేసిన తప్పుకు అందరినీ నిందించాల్సి వస్తోంది. ప్రకాశం జిల్లాలో కూడా ఇలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. చిన్నారికి స్వీట్ ఆశ చూపి.. లైంగికదాడికి తెగబడ్డాడు. రెండోసారి లైంగికదాడి చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విషయం బయటకు పొక్కడంతో.. బాధితురాలి బంధువులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు పోక్సో కింద కేసు నమోదు చేశారు.
Recommended Video

చిన్నారిపై పాస్టర్ కన్ను..
ప్రకాశం జిల్లా ఒంగోలు రైల్వే ఓవర్ బ్రిడ్జీ పక్కన గల ఓ చర్చి ఉంది. అక్కడ తేళ్ల అపోలో అనే పాస్టర్ ఉన్నాడు. అతను రోజూ ప్రార్థనలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. విద్యార్థులకు ట్యూషన్ కూడా చెప్పడంతో మంచివాడు అనుకున్నాడు. కానీ కాలనీకి చెందిన నాలుగో తరగతి చదివే విద్యార్థిని ట్యూషన్ వస్తోంది. అప్పుడుప్పుడూ ప్రార్థనా మందిరానికి కూడా వస్తోంది. దీంతో చిన్నారిపై పాస్టర్ కన్నుపడింది. ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని భావించాడు. సమయం కోసం వేచి..చూసి కాటేశాడు.

పేరంట్స్ లేరు..
చిన్నారికి తల్లిదండ్రులు లేరు. దీనిని పాస్టర్ అనుకూలంగా మలచుకున్నాడు. ఆమె అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకుంటోంది. చుట్టుపక్కల వారిని ఆప్యాయంగా పిలుచుకుంటూ మంచిగా మెలగుతుంది. అయితే చిన్నారికి స్వీటు ఇస్తానని ఆశచూపాడు. స్వీటు సంగతెమో కానీ.. లైంగికదాడి చేశాడు. తర్వాత ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. ఐదు రోజుల క్రితం మరోసారి లైంగికదాడికి తెగబడ్డాడు. పాస్టర్ పన్నాగాన్ని బాలిక స్నేహితులు తెలుసుకున్నారు. చిన్నారి స్నేహితులు బాలికకు పిన్ని వరసయ్యే వ్యక్తి తెలిపారు.

దిశ పీఎస్‌లో కేసు
ఘటనపై ఆదివారం దిశ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడని.. త్వరలో పట్టుకుంటామని చెప్పారు. కానీ స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపింది. పాస్టర్ పాడుపని ఏంటీ అని చర్చించుకుంటున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేదంటే మరొకరు రెచ్చిపోయే అవకాశం ఉందన్నారు. మహిళ సంఘాలు, ప్రజాసంఘాలు మాత్రం అతనిని తీవ్రంగా శిక్షించాలని కోరుతున్నాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications