టీడీపీలో మరో వికెట్ డౌన్..? సీఎం జగన్‌ను కలిసిన ఎమ్మెల్సీ..
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ఇప్పటికే టీడీపీకి దూరమైన సంగతి తెలిసిందే. ఆ పార్టీ ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నట్టు కనిపిస్తున్నారు. బుధవారం మండలిలో రూల్.71పై వైసీపీకి అనుకూలంగా ఓటేసి టీడీపీకి షాక్ ఇచ్చిన సునీత.. తాజాగా వైఎస్ జగన్‌తో భేటీ అయి పార్టీకి దూరమవుతున్న సంకేతాలు ఇచ్చారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో భేటీ అనంతరం పోతుల సునీత మీడియాతో మాట్లాడారు. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరడానికే సీఎం జగన్‌ను కలిశానని స్పష్టం చేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్ ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడిన సునీత.. రాష్ట్ర అభివృద్ది పరిపాలన వికేంద్రీకరణతోనే సాధ్యమని అన్నారు.

మండలిలో బుధవారం చోటు చేసుకున్న పరిణామాలు బాధాకరం అన్నారు. దేశం మొత్తం ఆ ఘటనను గమనించిందని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు. టీడీపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే బిల్లులను మండలిలో అడ్డుకున్నారని, మండలి ఛైర్మన్ హోదాలో ఉన్న షరీఫ్ టీడీపీ కార్యకర్త వ్యవహరించారని మండిపడ్డారు.అంతేకాదు, మండలి రాష్ట్ర అభివృద్దికి ఆటంకంగా మారిందని.. అది ఉండాలా వద్దా అన్న అంశంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు.
నియోజకవర్గ నిధుల కోసమే సీఎంను కలిసినట్టు చెప్పినప్పటికీ.. సునీత టీడీపీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు.. ఆమె పార్టీకి దూరమవుతున్నారనే సంకేతాలను స్పష్టం చేస్తున్నాయి. దీంతో మండలిలో టీడీపీ సంఖ్యాబలం పడిపోనుంది. ఇప్పటికే డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా.. శివనాథ్ రెడ్డి కూడా మండలి ఓటింగ్‌లో వైసీపీకి అనుకూలంగా ఓటేశారు. ఓటింగ్ సందర్భంగా మరో ఇద్దరు ఎమ్మెల్సీలు శత్రుచర్ల,శమంతకమణి హాజరుకాలేదు. వీరు పార్టీకి దూరంగా ఉండదలుచుకున్నారా.. లేక పార్టీతో కొనసాగదులుచుకున్నారా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.
-
జగన్ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్ కలకలం-హైకోర్టుకు వైసీపీ-డీజీపీకి ఘాటు లేఖ..! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications