అనారోగ్యంతో భార్య హాస్పటల్ లో.. మరదలుపై బావ అఘాయిత్యం.!అవమానంతో మరదలు ఆత్మహత్య..!!
అమరావతి/హైదరాబాద్ ; సమాజంలో వావి వరసలు మంటగలుస్తున్నాయి. ప్రసార మాద్యమాల్లో వస్తున్న వింత పోకడలకు నేటి తరం బానిసలైపోతోంది. పాశ్చాత్య సంస్క్రుతి, నాగరికత పేరుతో విశ్రుంఖలత్వం పేట్రేగిపోతోంది. అందుకు సోషల్ మీడియాలో వస్తున్న కధనాలు, కధలు, దృశ్యాలు,చిత్రాలు అన్ని దోహదం చేస్తున్నాయి. ఇవన్నింటి ప్రభావంతో మానవత్వంతో వ్యవహిరాంచాల్సిన మనిషి మృగంలా మారిపోతున్నాడు. మనసులో దాగి ఉన్న వాంఛలను ఒక్కసారిగా బయటకు తెప్పించుకుని జంతులక్షణాలను చూపించుకుంటున్నాడు.
మనిషి జంతువుతో సమానం అనిపించే ఘటన అమరావతిలో చోటుచేసుకుంది. కుటుంబపెద్దగా అన్నీ తానై తండ్రి తర్వాత తండ్రలా వ్యవహరించాల్సిన ఆ పెద్ద మనిషి మరదలు జీవితాన్ని బుగ్గిపాలు చేసాడు. భార్య అనారోగ్యంతో హాస్పటల్ ఉండగా, సపర్యలు చేయడానికి వచ్చిన మరదలుపై అదును చూసి వేటు వేసాడు కసాయి బావ. బావ చేష్టలకు అవమాన భారంతో నిండు ప్రాణాలు తీసుకుంది ఆ యువతి. సభ్య సమాజానికి తలవంపులు తెచ్చిన ఘటనకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం చోటు చేసుకుంది. అక్క అనారోగ్యం బారిన పడడంతో మరదలిపై కన్నేసిన బావ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బావ వేధింపులు భరించలేని యువతి చివరికి ప్రాణాలు తీసుకుంది. ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తి ఐదేళ్ల క్రితం ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఆరోగ్యం సరిగా లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని అత్తవారింట్లో ఇల్లరికం అల్లుడుగా తిష్ట వేశాడు. ఈ క్రమంలో మరదలిపై కోరిక కలిగిన ఆ నీచుడు పలుమార్లు పెళ్లి చేసుకుందామని బలవంతం చేశాడు. .
అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే తల్లీ, తండ్రి, అక్కను చంపేస్తానని బెదిరించాడు. ఇటీవల తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూడడంతో సుధాకర్ భార్యతో గొడవపడ్డాడు. మరదలితో తాను కలిసిన వీడియోలు ఉన్నాయని, అవి బయటపెడతానని బెదిరించాడు. ఆమెను తనకే ఇచ్చి పెళ్లి చేయాలని ఒత్తిడి చేశాడు. సుధాకర్ అసలు స్వరూపం బయడపడంతో వారు రెండో పెళ్లికి అంగీకరించలేదు. దీంతో సుధాకర్ వేధింపులు పెరిగిపోవడంతో యువతి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాము సుధాకర్‌ను పలుమార్లు మందలించామని, అయినా అతనిలో మార్పు రాలేదని యువతి బంధువులు తెలిపారు.












Click it and Unblock the Notifications