IPL 2023 : నెపోటిజం అన్నారుగా.. అర్జున్ టెండూల్కర్ తొలివికెట్ పై ప్రీతీజింటా రియాక్షన్..
ఐపీఎల్ లో రెండేళ్ల క్రితమే ముంబై ఇండియన్స్ జట్టుకు ఎంపికైనా తొలి మ్యాచ్ అరంగేట్రం కోసం అర్జున్ టెండూల్కర్ ఈ సీజన్ వరకూ వేచి చూడక తప్పలేదు. ఎట్టకేలకు ఈ సీజన్లో కోల్ కతా నైట్ రైడర్స్ తో తొలి మ్యాచ్ ఆడిన అర్జున్.. రెండు ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి ఫర్వాలేదనిపించాడు. రెండో మ్యాచ్ లో నిన్న హైదరాబాద్ సన్ రైజర్స్ తో ఆడిన అర్జున్ 2.5 ఓవర్లు వేసి 18 పరుగులిచ్చి ఓ వికెట్ తీశాడు. తద్వారా ఐపీఎల్ లో తొలి వికెట్ సాధించాడు.
ఘనమైన క్రికెట్ వారసత్వం ఉన్నా తీవ్ర ఒత్తిడి, తడబాటుతో కనిపిస్తున్న అర్జున్ టెండూల్కర్ ఎట్టకేలకు ఐపీఎల్ తొలివికెట్ సాధించడంతో అందులో సగం ఒత్తిడి ఎగిరిపోయింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్ కు అర్జున్ వేసిన బంతిని కొట్టే ప్రయత్నంలో రోహిత్ శర్మకు దొరికిపోయాడు. దీంతో ఐపీఎల్ లో అర్జున్ కు తొలి వికెట్ దక్కినట్లయింది.
దీంతో ఇప్పుడు ఐపీఎల్ తదుపరి మ్యాచుల్లో అర్జున్ టెండూల్కర్ ఏం చేయబోతున్నాడనే ఉత్కంఠ పెరిగింది.

మరోవైపు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ లో తొలి వికెట్ సాధనపై అభినందనలు వెల్లువెత్తాయి. ఇన్నాళ్లు ఐపీఎల్ అరంగేట్రం కోసం ఎదురుచూసిన అర్జున్ కల ఎట్టకేలకు తీరిందని అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. సత్తా ఉన్న బౌలరే అయినా ఇన్నాళ్లూ ఐపీఎల్ లో అరంగేట్రం చేయలేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న అభిమానులు సైతం తొలి వికెట్ తీయడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో అతన్ని ప్రశంసిస్తున్నారు.
మరోవైపు పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా సైతం అర్జున్ టెండూల్కర్ తొలి వికెట్ పై స్పందించారు. గతంలో నెపోటిజం (బంధుప్రీతి) పేరుతో అర్జున్ పై విమర్శలు చేశారని, ఇప్పుడు అతను తన స్ధానమేంటో చూపించాడన్నారు. తనయుడు అర్జున్ ప్రదర్శనతో సచిన్ కూడా గర్వంగా ఫీలవుతుంటారని ప్రీతి తెలిపింది. మరోవైపు సచిన్ మాజీ టీమ్ మేట్ మహ్మద్ కైఫ్ కూడా అర్జున్ తొలి వికెట్ పై స్పందించారు. అర్జున్ ఇవాళ తానేంటో చూపించాడని, ముఖ్యంగా చివరి ఓవర్లో కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడని కైఫ్ తెలిపాడు. అర్జున్ కు విజయవంతమైన సుదీర్ఘ కెరీర్ కోరుకుంటున్నట్లు కైఫ్ తెలిపాడు
Many mocked him for nepotism but tonight he has shown his spot is well earned 👏 Congrats Arjun. @sachin_rt you must be so proud #Arjuntendulkar #SRHvsMI #TATAIPL2023
— Preity G Zinta (@realpreityzinta) April 18, 2023
-
కొబ్బరి నీళ్లు.. చెరకు రసం - వేసవిలో ఈ రెండింటిలో ఏది మంచిది..!? -
ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ.. -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications